30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన హీరో మృతి.. తట్టుకోలేక ఆగిన తల్లి గుండె!

|

Oct 13, 2023 | 2:59 PM

తమిళ దర్శక దిగ్గజం భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన  'ఎన్నుయిర్ తోజన్' (1990) చిత్రంతో హీరోగా పరిచయం అయిన నటుడు బాబు గుర్తున్నాడా? ఈ మువీలో మురికి వాడలో నివసించే రాజకీయ కార్యకర్తగా అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మువీ సూపర్ హిట్ కొట్టడంతో ఒకేసారి పది సినిమా ఆఫర్లు వచ్చాయి. వాటన్నింటికీ కూడా నటుడు బాబు సంతకాలు చేశారు. అలా సంతకాలు చేసిన సినిమాల్లో 'మనసారా వస్తుంగలేన్‌' కూడా ఒకటి. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో..

30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన హీరో మృతి.. తట్టుకోలేక ఆగిన తల్లి గుండె!
Tamil Actor Babu
Follow us on

తమిళ దర్శక దిగ్గజం భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన  ‘ఎన్నుయిర్ తోజన్’ (1990) చిత్రంతో హీరోగా పరిచయం అయిన నటుడు బాబు గుర్తున్నాడా? ఈ మువీలో మురికి వాడలో నివసించే రాజకీయ కార్యకర్తగా అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మువీ సూపర్ హిట్ కొట్టడంతో ఒకేసారి పది సినిమా ఆఫర్లు వచ్చాయి. వాటన్నింటికీ కూడా నటుడు బాబు సంతకాలు చేశారు. అలా సంతకాలు చేసిన సినిమాల్లో ‘మనసారా వస్తుంగలేన్‌’ కూడా ఒకటి. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు బాబు కొన్ని ఫైట్‌ సన్నివేశాల్లో డూప్‌ లేకుండా నటించాడు. ఈ క్రమంలో ‘మనసారా వస్తుంగలేన్‌’ సినిమా షూటింగ్‌ తీస్తున్న సమయంలోనే అనుకోని ప్రమాదం ఆయన్ని వెంటాడింది.

డూప్‌ లేకుండా ఎత్తైన కొంతమీద నుంచి అమాంతం దూకేశాడు. అయితే కింద అమర్చిన సేఫ్టీ ట్రాక్‌లో కాకుండా వేరేచోట పడిపోయాడు. హీరోగా ఎదుకుగున్న టైంలో జరిగిన ఈ ప్రమాదం నటుడి జీవితాన్ని తలకిందులు చేసింది. తమిళ చిత్ర సీమలో అగ్రహీరోగా ఎదగగలిగిన సత్తా ఉన్న నటుడు బాబు ఈ ప్రమాదం తర్వాత చలనం లేకుండా మంచానికే పరిమితం అయ్యాడు. ఈ ప్రమాదంలో బాబు వెన్నెముక విరిగిపోయింది. ఆపరేషన్‌ చేయించుకున్నప్పటికీ కూర్చోలేక పోయేవాడు. అలా దాదాపు 30 ఏళ్లపాటు మంచాన ఉన్న బాబు గతనెల (సెప్టెబర్‌) 19న అనారోగ్యంతో కన్నుమూశాడు. నటుడు బాబు మరణం అతని తల్లి ప్రేమని తీవ్రంగా కలచివేసింది. 3 శతాబ్ధాలుగా కొడుక్కి నిద్రహారాలు మాని సపర్యలు చేసిన ఆ తల్లి కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ప్రేమ బుధవారం (అక్టోబర్‌ 11) కూడా కన్నుమూసింది. కొడుకు చనిపోయిన మూడు వారాలకే తల్లి కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అంతులేని విషాదాన్ని మిగిల్చింది.

బాబు తల్లి ప్రేమ ఎవరో కాదు.. తమిళనాడు మాజీ అసెంబ్లీ స్పీకర్ కె రాజారాంకు ఆమె స్వయానా సోదరి. ఇన్నాళ్లూ తన కొడుకును చూసుకున్న ఆ తల్లి కొడుకు మరణించడంతో గుండె పగిలిపోయింది. దీంతో పూర్తిగా దుఃఖంలో మునిగిపోయిన ఆమె ఆహారం తీసుకోవడానికి నిరాకరించింది. ఈ క్రమంలోనే పూర్తిగా నీరసించి ఆమె మరణించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.