Vijay Thalapathy: తెలుగులో విజయ్ సినిమా కన్ఫర్మ్.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్.. షూటింగ్ ఎప్పుడంటే..

Vijay Thalapathy: దక్షిణాది సినీ పరిశ్రమలో భారీ మార్కెట్ అండ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో ఇళయ తలపతి విజయ్ ఒకరు.

Vijay Thalapathy: తెలుగులో విజయ్ సినిమా కన్ఫర్మ్.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్.. షూటింగ్ ఎప్పుడంటే..
Vijay

Updated on: May 31, 2021 | 2:39 PM

Vijay Thalapathy: దక్షిణాది సినీ పరిశ్రమలో భారీ మార్కెట్ అండ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో ఇళయ తలపతి విజయ్ ఒకరు. బ్లాక్ బస్టర్ మాస్టర్ సినిమా తర్వాత కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత విజయ్ డైరెక్ట్ గా టాలీవుడ్ చిత్రంలో నటించనున్నారని గత కొన్ని రోజులుగా టాక్ నడుస్తోంది. ఇప్పుడు అది నిజం అని తేలింది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, నేషనల్ అవార్డు అందుకున్న స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి త్వరలోనే విజయ్ తో తెలుగులో సినిమా చేయనున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ.. తలపతి విజయ్ తో దిల్ రాజు కాంబోలో సినిమా ఉందని.. అది విజయ్ కు 66వ సినిమా అని తెలిసింది. ఆ సాలిడ్ ప్రాజెక్ట్ ను ఈ కోవిడ్ పరిస్థితులు తగ్గిన తర్వాత అనౌన్స్ చేస్తామని వంశీ కన్ఫర్మ్ చేశారు. సో విజయ్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్ అధికారికంగానే లైన్ లో ఉందని కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తీయనున్నట్లు సమాచారం. ఆల్రెడీ తెలుగు లో రజినీ తర్వాత అంతటి మార్కెట్ సొంతం చేసుకున్న తమిళ్ హీరోగా విజయ్ క్రేజ్ సంపాదించుకున్నాడు. మరి ఈ సినిమాతో తెలుగులో మొదటి సారి అడుగుపెట్టడం విజయ్ ఫ్యాన్స్ కి ఓ పెద్ద పండగే అని చెప్పుకోవాలి. Vamshi Paidipally

Also Read: Tamannaah: క‌రోనా సెకండ్ వేవ్‌తో ద‌య‌చేసి జాగ్ర‌త్త‌గా ఉండండి.. స్వీయ అనుభ‌వాన్ని పంచుకున్న త‌మ‌న్నా..

Disha Patani: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలీవుడ్ భామ.. కుర్రాళ్ళ గుండెలను కొల్లగొడుతున్న దిశాపటాని..

TS Medical Colleges : రాష్ట్రంలో ఏడు మెడికల్ కాలేజీలు , వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

Helplines : నాలుగు హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం, ప్రజలకు తెలియ పర్చాలని టీవీ ఛానళ్లకు వినతి