దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ హీరోలలో విజయ్ తలపతి (Vijay Thalapathy) ఒకరు. తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ ఈ హీరోకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. విజయ్ నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. ఇదిలా తాజాగా విజయ్ తలపతికి మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. చాలా కాలం క్రితం విజయ్ లండన్ నుంచి లగ్జరీ బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు. దీనికి ఎంట్రీ టాక్స్ చెల్లించకపోవడంతో వాణిజ్య పన్నుల శాక హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయంపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాకుండా.. టాప్ స్టార్స్ ఇలా పన్నులు ఎగవేతకు పాల్పడడం సమంజసం కాదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయ్ ఎంట్రీ ట్యాక్స్ చెల్లించారు. అయితే తనపై ప్రత్యేక న్యాయమూర్తి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను రద్దు చేయలంటూ విజయ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే విషయం పై శుక్రవారం విచారణ జరిగింది. ప్రత్యేక న్యాయమూర్తి చేసిన చేసిన వ్యాఖ్యలను తొలగించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. పన్ను మినహాయింపు కేసు ఇంకా కోర్టులో పెండింగ్లో విజయ్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ వాణిజ్య పన్నుల శాఖను ఆదేశిస్తూ కోర్టు మధ్యంతర స్టే ఆర్డర్ జారీ చేసింది.
Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..