Suriya: చనిపోయిన అభిమాని కుటుంబానికి అండగా సూర్య.. వీడియో కాల్ ద్వారా ఓదార్పు..
జూలై 23న సూర్య పుట్టిన రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా సెలబ్రెషన్స్ చేశారు. ఈ క్రమంలోనే ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేట మోపువారిపాలెంకు చెందిన ఫ్యాన్స్ సూర్య బర్త్ డే సెలబ్రెషన్స్ చేసే సమయంలో అనుకోకుండా మరణించారు. సూర్య బర్త్ డే సెలబ్రెషన్స్ కోసం ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో కరెంట్ షాక్ కు గురైన ఇద్దరు అభిమానులు మృతి చెందారు.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సూర్య నటించిన చిత్రాలన్ని తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అయితే జూలై 23న సూర్య పుట్టిన రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా సెలబ్రెషన్స్ చేశారు. ఈ క్రమంలోనే ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేట మోపువారిపాలెంకు చెందిన ఫ్యాన్స్ సూర్య బర్త్ డే సెలబ్రెషన్స్ చేసే సమయంలో అనుకోకుండా మరణించారు. సూర్య బర్త్ డే సెలబ్రెషన్స్ కోసం ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో కరెంట్ షాక్ కు గురైన ఇద్దరు అభిమానులు మృతి చెందారు.
డిగ్రీ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మోపువారిపాలెంలో సూర్య బర్త్ డే బ్యానర్స్ కడుతున్న సమయంలో కరెంట్ షాక్కు గురయ్యారు. ఈ ప్రమాదంలో పోలూరు సాయి, నక్కా వెంకటేష్ అక్కడిక్కక్కడే మరణించగా.. మరో అభిమాని తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.




ఇక ఈ విషయం తెలుసుకున్న సూర్య బాధిత కుటుంబాలను ఫోన్ చేసి పరామర్శించారు. తన పుట్టినరోజు వేడుకలలో ఇలా జరగడం తనకు బాధ కలిగించిందని.. మరణించిన అభిమానుల కుటుంబాలకు వీడియో కాల్ ద్వారా పరామర్శిచారు సూర్య. అలాగే ఆ కుటుంబాలకు తాను ఎప్పటికీ తోడుగా ఉంటానని మాటిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చనిపోయిన ఇద్దరు యువకులు అటు ఎన్టీఆర్ అభిమానులు కూడా. తన ఫ్యాన్స్ మరణ వార్త తెలుసుకుని వెంటనే వారి కుటుంబాలకు భరోసా కల్పించిన సూర్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు తారక్ ఫ్యాన్స్.
Tnx For Responding @Suriya_offl Anna🥺❤️
A Special Thanks To @NelloreNTRfc 🥺🙏🏻
Jeevitham Motham Neeku Runapadi Vuntaa Bro😭😭
Naa Friend Valla Family Ni Surya Garitho Matladinchi Valla Family Ki Support Ga Vundela Chesinanduku Thank You Bro🥺😭#HappyBirthdaySuriya pic.twitter.com/xhaOUgMDv4
— Naveen Chowdary👑 (@peacefull_life7) July 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




