Movies: ఈ వారం సినిమాల రచ్చే.. థియేటర్‌లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ ఇదే
ఈ వారం కూడా థియేటర్స్ తో పాటు ఓటీటీలోనూ అలరించడానికి కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది బ్రో మూవీ గురించే ..

ప్రతివారం కొత్త సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వారం వారం నయా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఈ వారం కూడా థియేటర్స్ తో పాటు ఓటీటీలోనూ అలరించడానికి కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది బ్రో మూవీ గురించే .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా జులై 28న విడుదల కానుంది. ఈ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తమిళ్ లో ఘనవిజయం సాధించిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పాటు నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు హీరోగా ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తున్న స్లం డాగ్ హస్బెండ్ అనే సినిమా కూడా ఈ వారం రిలీజ్ కానుంది. ఈ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది.
అలాగే బాలీవుడ్ లో రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ అనే సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్, అలియాభట్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల28న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు ఓటీటీలోనూ సందడి చేయడానికి సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటంటే..
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు..
- డ్రీమ్ ( జులై 25)
- మామన్నన్ (జులై 27)
- పారడైజ్ (జులై 27)
- హిడెన్ స్ట్రైక్ (జులై 27)
- హ్యాపీనెస్ ఫర్ బిగినెర్స్ (జులై 27)
- హౌ టు బికమ్ ఎ కల్ట్ లీడర్ (జులై 28)
అలాగే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న మూవీస్
7.ఆషిఖానా ( జులై 24)
సోనీలివ్ లో ఆకట్టుకోనున్న సినిమాలు…
8. ట్విస్టెడ్ మెటల్ ( జులై 28)
బుక్ మై షో
9.జస్టిస్ లీగ్: వార్ వరల్డ్ (యానిమేషన్ మూవీ) జులై 23 10. ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ (హాలీవుడ్) జులై 26 11. ద ఫ్లాష్ (జులై 27)
జియో సినిమా
12.లయనెస్ (జులై 23)
13. కాల్‌కూట్ (హిందీ) జులై 27
మనోరమా మ్యాక్స్
14. కొళ్ల (జులై 27)




