Actor Mohan: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. రోడ్డు పక్కన నటుడి మృతదేహం..

ప్రముఖులు మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నిండిపోయింది. ఇటీవలే ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలిసిందే.. ఇంతలోనే మరో నటుడు కన్నుమూశారు.  తాజాగా ఓ నటుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పలు సినిమాల్లో సహాయకపాత్రలో నటించిన మోహన్‌ కన్నుమూశారు. ఆయన మృతదేహం రోడ్డు పక్కన లభించిందని పోలీసులు తెలిపారు. తమిళనాడులోని మధురై జిల్లా తిరుప్పాంగుండ్రం రోడ్డు పక్కన ఒక మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందిచారు స్థానికులు.

Actor Mohan: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. రోడ్డు పక్కన నటుడి మృతదేహం..
Mohan
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 03, 2023 | 11:34 AM

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రెటీలు వివిధ కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రముఖులు మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నిండిపోయింది. ఇటీవలే ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలిసిందే.. ఇంతలోనే మరో నటుడు కన్నుమూశారు.  తాజాగా ఓ నటుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పలు సినిమాల్లో సహాయకపాత్రలో నటించిన మోహన్‌ కన్నుమూశారు. ఆయన మృతదేహం రోడ్డు పక్కన లభించిందని పోలీసులు తెలిపారు. తమిళనాడులోని మధురై జిల్లా తిరుప్పాంగుండ్రం రోడ్డు పక్కన ఒక మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందిచారు స్థానికులు. దాంతో పోలీసులు ఆ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది పోస్ట్ మార్టాన్ ను నిర్వహించారు. దాంతో ఆ మృత దేహం నటుడు మోహన్ ది అని తేలింది. కమల్ హాసన్ నటించిన విచిత్ర సోదరులు సినిమాలో నటించాడు మోహన్. ఆ సినిమాలో ఆయన మరుగుజ్జు స్నేహితుడిగా కనిపించాడు మోహన్.

ఈ సినిమాతో పాటు నాన్‌ కడవుల్‌, అదిశయ మనిదర్‌గళ్‌‌లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు మోహన్.  మోహన్ స్వగ్రామం సేలం జిల్లా మేటూర్‌. అయితే అతడు సేలం నుంచి మధురై ఎందుకు వెళ్ళాడు. అతడు ఎలా చనిపోయాడు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోహన్ మరణ వార్త కుటుంబసభ్యులకు తెలిపారు పోలీసులు.

అయితే మోహన్ అవకాశాల కోసం మదురై వచ్చాడని.. ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాకపోవడంతో మదురైలో రోడ్ల పై బిక్షాటన చేస్తున్నాడని.. పేరరికం కారణంగా అనారోగ్యంతో అతడు మరణించి ఉంటాడని అంటున్నారు. మోహన్ మరణంతో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.