నాని సినిమా పైనే ఆశలు పెట్టుకున్న కేజీఎఫ్ హీరోయిన్..
04 March 2025
Rajeev
నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రీనిధి శెట్టి.
మొదటి సినిమానే కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించింది. ఆ సినిమా రెండు భాగాల్లోనూ నటించి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది.
కేజీఎఫ్ సినిమాల తర్వాత చియాన్ విక్రమ్ తో కోబ్రా మూవీలో మెరిసింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.
సినిమా కెరీర్ అంతగా సక్సెస్ కాలేకపోయినా వరుసగా ఫోటోషూట్స్ చేస్తూ అదరగొట్టేస్తుంది శ్రీనిధి శెట్టి.
క్రేజ్ సంపాదించాలంటే సినిమాలే చేయాల్సిన అవసరం లేదని.. చెప్పకనే చెప్తుంది ఈ చిన్నది.
ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న హిట్ 3లో హీరోయిన్ గా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
నాని సినిమా పైనే ఈ బ్యూటీ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.. మరి ఈ సినిమా ఏ ముద్దుగుమ్మకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
శంకర్ ఏం చేస్తాడబ్బా.. దిగ్గజ దర్శకుడికి అష్ట దిగ్భంధనం..!
సైడ్ సైడ్ ప్లీజ్.. అప్కమింగ్ హీరోయిన్స్ వచ్చేస్తున్నారండహో..!
బాబోయ్ ఏంటీ కలెక్షన్లు.. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్లే బెటరా..?