ప్లీజ్.. ఇకపై నన్ను అలా పిలవొద్దు .. నయనతార విజ్ఞప్తి
05 March 2025
Basha Shek
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో యాక్ట్ చేస్తోంది నయన తార.
ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉంటోందీ అందాల తార.
కాగా తన నటనా ప్రతిభకు గుర్తింపుగా అభిమానులు ఆమెకు 'లేడీ సూపర్ స్టార్' అని బిరుదు ఇచ్చారు.
అయితే ఇప్పుడు ఆ బిరుదును వద్దంటోంది నయనతార. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందామె.
అభిమానులు ఎంతో ప్రేమతో అలా పిలవడం ఆనందంగా ఉన్నా.. నయనతార పేరే తన మనసుకు దగ్గరైందని నటి తెలిపింది.
'మీరెంతో ప్రేమతో ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్ బిరుదుకు నేను రుణపడి ఉంటా. కానీ, నయనతార అని పిలిస్తేనే నాకు ఆనందం'
లేడీ సూపర్‌స్టార్‌లాంటి బిరుదులు వెలకట్టలేనివి. అదే సమయంలో వాటివల్ల కంఫర్ట్‌గా ఉండలేని పరిస్థితి కూడా ఉంటుంది
లేడీ సూపర్‌స్టార్‌లాంటి బిరుదులు వెలకట్టలేనివి. అదే సమయంలో వాటివల్ల కంఫర్ట్‌గా ఉండలేని పరిస్థితి కూడా ఉంటుంది
ఇక్కడ క్లిక్ చేయండి..