Dhanush Birth Day: తమిళ్ స్టార్ ధనుష్ (Dhanush) నేరుగా తెలుగులో నటిస్తోన్న చిత్రం సార్. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోనూ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీని అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్), శ్రీకర స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా జూలై 28న ధనుష్ బర్త్ డే సందర్బంగా ఈ మూవీ నుంచి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ చేశారు మేకర్స్.
అందులో ధనుష్ ‘సార్’ ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా,దీక్షగా రాసుకుంటున్నట్లు కనిపిస్తారు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు, దేనికి సిద్ధ మవుతున్నారు లాంటి ప్రశ్నలన్నిటికీ ‘సార్’ సమాధానం వెండితెర మీద చూడాల్సిందే. ఈ ప్రచారచిత్రం తో చిత్రం పట్ల పెరిగిన ఆసక్తి మరింత స్థాయికి వెళ్ళే దిశగా ధనుష్ పుట్టినరోజు నాడు అనగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల అయ్యే వీడియో చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
Welcome the versatile @dhanushkraja in & as #Vaathi / #SIR ?
Presenting to you the #VaathiFirstLook / #SIRFirstLook ?
Teaser out tomorrow at 6pm! #VaathiTeaser #SIRTeaser ✨#VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya #SrikaraStudios pic.twitter.com/6CF2UGfKEl
— Sithara Entertainments (@SitharaEnts) July 27, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.