తమిళ్ స్టార్ హీరో ఆర్య పై శ్రీలంకకు చెందిన విద్జా అనే మహిళ చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తన దగ్గరి నుంచి హీరో ఆర్య రూ.70 లక్షలు తీసుకుని తప్పించుకుంటున్నారని ఆ మహిళల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే హీరో ఆర్య చీటింగ్ కేసు తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు విచారణ విషయంలో చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆర్యను విచారించడానికి లీగల్ నోటీసులను కూడా జారీ చేశారు. ఆర్య కూడా పోలీసులకు సహకరిస్తూ.. విచారణకు హజరవుతూ వచ్చారు. అలా ఆర్యను పలుమార్లు విచారించిన తర్వాత పోలీసులు చీటింగ్ కేసు మీద ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ చీటింగ్ ఆర్య చేయలేదని.. హీరోను ఇరికించడానికి వేరేవారు ఈ పని చేసినట్లుగా తెల్చారు.
దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. అసలైన నిందితులను పట్టుకోవడానికి పోలీసులు మరో కోణంలో విచారణ జరపగా.. అసలు మోసగాళ్లను కనిపెట్టారు. చెన్నైలోని పులియంతోపకు చెందిన మహమ్మద్ ఆర్మాన్.. మహ్మాద్ హుస్సేనీ అనే ఇద్దరు వ్యక్తులు ఆర్య పేరుతో నకిలీ వాట్సప్ క్రియేట్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లుగా నిర్దారించారు. ఆర్య పేరుతో శ్రీలంక మహిళ విద్జాతో చాటింగ్ చేసి.. ఆమెతో చనువు పెంచుకున్నారని.. ఈ నేపథ్యంలోనే ఆమె దగ్గరి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ చీటింగ్ కేసులో ఆర్య నిర్ధోషి అని తనకు దీనితో ఏలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. ఇక అరెస్ట్ చేసిన దోషులపై చీటింగ్ నమోదు చేసి.. కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
ఇక చీటింగ్ కేసులో అసలు దోషులను పట్టుకున్నందుకు ఆర్య పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నిజమైన దొంగలను పట్టుకున్నందుకు సైబర్ క్రైమ్ పోలీసులకు ధన్యవాదాలు. ఈ ఆరోపణ నా మనసుని గాయపరిచింది. ఇప్పుడెంతో ఉపశమనంగా ఉంది. నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఆర్య ట్వీట్ చేశారు.
Salman khan: సల్మాన్ ఖాన్‌ని అడ్డుకోవడంలో తప్పులేదు..! అతడు తన బాధ్యతను మాత్రమే నిర్వహించాడు..