
తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్స్ లిస్ట్ లో ముందు వరసలో ఉంటారు టబు. తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ్ తోపాటు హిందీలోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంటుంది సీనియర్ హీరోయిన్ టబు. నేడు టబు పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా అందరూ టబుకు విషెస్ తెలుపుతున్నారు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కాగా టబు హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. మొన్నామధ్య అల వైకుంఠపురంలో సినిమాలో కనిపించింది. ఇక హిందీలో సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు టబు విలన్ గా మారనుందని తెలుస్తుంది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాలో టబు విలన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ తో రిలేషన్‌లో ఉందంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఆ హీరో ఎవరో కాదు అజయ్ దేవగన్. టబు అజయ్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అప్పట్లో అజయ్, టబు మధ్య ప్రేమాయణం నడిచిందని టాక్ ఉంది. అజయ్ దేవగన్ తో టబు ఎన్నో సినిమాల్లో చేసింది. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. చిన్న తనం నుంచి టబు, ఆమె సోదరుడు సమీర్ , అజయ్ స్నేహితులట. అప్పట్లో నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎవరైనా అబ్బాయిలు నా వెంట పడితే మా అన్నయ్యతో కలిసి అజయ్ వాళ్లని పిచ్చి కొట్టుడు కొట్టేవాడు. దాంతో అబ్బాయిలు నాతో మాట్లాడటానికి, నన్ను చూడటానికి కూడా భయపడేవారు అని చెప్పుకోచ్చింది టబు.
అలాగే తెలుగులో కింగ్ నాగార్జునకు టబుకు మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ గుసగుసలు వినిపించాయి. కానీ తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు. ఇక తెలుగులో టబు వెంకటేష్ నటించిన కూలీ నెంబర్ వన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కూలీ నెంబర్ 1’ తర్వాత చాలా రోజులకి ‘నిన్నే పెళ్లాడతా’లో నటించింది. ఆ సినిమాలో నాగార్జునతో టబు కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ‘చెన్నకేశవరెడ్డి’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘అందరివాడు’, ‘పాండురంగడు’, ‘ఇదీ సంగతి’ ఇసినిమాలు చేసింది. చివరిగా అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలో నటించింది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి