అక్కడుంది చిరంజీవి ‘సైరా’..అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ ఔరా!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న హై రేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సైరా’. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ కావడంతో ఆయన తనయుడు రామ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అద్భుతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మెగా కుటుంబానికి మంచి […]

అక్కడుంది చిరంజీవి 'సైరా'..అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ ఔరా!
Sye Raa Narasimha Reddy sold for a huge amount!
Follow us

|

Updated on: Sep 02, 2019 | 1:53 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న హై రేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సైరా’. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ కావడంతో ఆయన తనయుడు రామ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అద్భుతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మెగా కుటుంబానికి మంచి క్రేజ్‌ ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సినిమా హక్కుల్ని రూ.19.6 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ జిల్లాల్లో ‘బాహుబలి 2’, ‘సాహో’ సినిమా హక్కులు కూడా ఇంత భారీ మొత్తానికి అమ్ముడు పోలేదని, ‘సైరా’ రికార్డు సృష్టించిందని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మూవీ యూనిట్  స్పందించాల్సిందే.

అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్‌ సౌత్ ఇండియాలోని ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక్కో స్టార్‌ని తీసుకోవడంతో సినిమాపై హైప్ భారీగా పెరిగిపోయింది.  అక్టోబరు 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో చిరంజీవి మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదు.