AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya’s Soorarai Pottru : ఆస్కార్ రేస్ నుంచి తప్పుకున్న సూర్య సినిమా.. నిరాశలో అభిమానులు

తమిళ స్టార్ హీరో సూర్య గత కొంత కాలంగా సరైన హిట్‌లేక ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో ఓ సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. సూరారై పోట్రు సినిమా తెరకెక్కించిన సూర్య కెరీర్‌లో

Suriya's Soorarai Pottru : ఆస్కార్ రేస్ నుంచి తప్పుకున్న సూర్య సినిమా.. నిరాశలో అభిమానులు
Surya
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2021 | 9:37 PM

Share

Suriya’s Soorarai Pottru : తమిళ స్టార్ హీరో సూర్య గత కొంత కాలంగా సరైన హిట్‌లేక ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో ఓ సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. సూరారై పోట్రు సినిమా తెరకెక్కించిన సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. లేడీ డైరెక్టర్ సుధ కొంగరు దర్శకత్వం వహిచిన ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది. ఈ సినిమాను ఓటీటీలోనే విడుదల చేసిన అద్భుత ప్రజాదరణ సొంతం చేసుకుంది. ప్రతి భాషలోనూ అందరినీ కట్టిపడేసింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ యొక్క నిజ జీవిత కథ నుండి ప్రేరణ పొందిన  ఈ సినిమా ఆస్కార్ పోటీలో నామినేట్ అయ్యిందని గతంలో వార్తలు వచ్చాయి. ఆస్కార్ పోటీలో నామినేట్ అవ్వడం పట్ల చిత్రయూనిట్ కూడా ఆనందం లో తేలిపోయింది.

సూర్య సొంత ప్రొడక్షన్ బ్యానర్, 2 డి ఎంటర్టైన్మెంట్, మరియు సిఖ్యా ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, మోహన్ బాబు, పరేష్ రావల్, ఊర్వశి, కరునాస్ కూడా నటించారు. అయితే ఇప్పుడు సూర్య సినిమా ఆస్కార్ రేస్ నుంచి తప్పుకుంది. అకాడమీ స్క్రీనింగ్ కు ఎంపిక అయిన సూరారై పోట్రు ఆతర్వాతి రౌండ్స్ కు నామినేట్ అవ్వలేకపోయింది. దాంతో సూర్య అభిమానులు నిరాశకు గురయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Oscars 2021 : అవార్డుల పంట ఆస్కార్ కు నామినేట్ అయ్యింది వీరే.. నామినీస్ ను అనౌన్స్ చేసిన ప్రియాంక, నిక్ జోనస్

Bigg Boss Fame: అసభ్యకరమైన పోస్ట్ పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Aamir Khan : అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాను విడిచిపెడుతున్నట్లు ప్రకటన.. ఎందుకో తెలుసా..