AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెట్టింట వైరల్ అవుతున్న సూర్య కూతురి ఇంటర్ మార్క్స్ లిస్ట్.. ఎంత స్కోర్ చేసిందంటే

కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి చెన్నై నుంచి ముంబైకి మకాం మార్చారు. దీంతో సూర్య కుటుంబం విచ్ఛిన్నమైందని.. తన తల్లిదండ్రులతో మనస్పర్థల కారణంగానే సూర్య తన ఫ్యామిలీతో కలిసి ముంబై వెళ్లిపోయారంటూ రూమర్స్ వినిపించాయి.

నెట్టింట వైరల్ అవుతున్న సూర్య కూతురి ఇంటర్ మార్క్స్ లిస్ట్.. ఎంత స్కోర్ చేసిందంటే
Surya
Follow us
Rajeev Rayala

|

Updated on: May 09, 2025 | 9:12 PM

స్టార్ హీరో సూర్య రీసెంట్ గా రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. కాగా సూర్య గురించి ఆయన క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ సపరేట్ స్టైల్ ను క్రియేట్ చేసుకున్నారు. సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి విజయాలను అందుకున్నారు. గజినీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

సూర్య నటించిన అన్ని సినిమాలు దాదాపు తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి. ఇక సూర్య సతీమణి జ్యోతిక గురించి కూడా అందరికి తెలిసిందే.. ఆమె కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తమ పిల్లను ఎంతో క్రమ శిక్షణతో పెంచుతున్నారు. సూర్య, జ్యోతికల ముద్దుల కుమార్తె దియా ఇంటర్ ఎక్జామ్స్ మార్కులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సూర్య- జ్యోతిక కుమార్తె దియా 12వ తరగతి పబ్లిక్ పరీక్ష రాసినట్లు, ఆమె స్కోర్‌లతో కూడిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 12వ జనరల్ ఎగ్జామినేషన్ లో సూర్య కూతురు దియా సత్తా చాటింది. చాలా మంది సెలబ్రెటీల పిల్లలు అత్యధిక మార్కులు తెచుకోకపోయినా పాస్ అయ్యితే చాలు అనే మెంటాలిటీతో ఉంటారు. కానీ సూర్య కూతురు మాత్రం చదువులో సత్తా చాటుతుంది. తమిళం-96, ఇంగ్లీష్-97, అకౌంట్స్-94, ఫిజిక్స్-99, కెమిస్ట్రీ-98, కంప్యూటర్ సైన్స్-97 లలో 600 కి 581 మార్కులు సాధించిన దియా ఫోటో ప్రతి సంవత్సరం వైరల్ అవుతోంది. అయితే ఈ మార్క్స్ లిస్ట్ పాతది అని తెలుస్తుంది. గత ఏడాది ఇంటర్ పరీక్షల్లో ఆమెకు వచ్చిన మార్కుల లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.