Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ అప్ కమింగ్ సినిమాలో చాలా హైలైట్స్ ఉండనున్నాయట..

|

Jun 08, 2022 | 6:52 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజినీకాంత్ చివరిగా దర్భార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ అప్ కమింగ్ సినిమాలో చాలా హైలైట్స్ ఉండనున్నాయట..
Supar Star
Follow us on

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజినీకాంత్ చివరిగా దర్భార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్ ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో మాత్రం అంతంతమాత్రంగానే ఆడింది ఈ సినిమా. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా రజినీకాంత్ 169 పైనే ఆశలు పెట్టుకున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఇటీవలే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నెల్సన్. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తమిళ్ లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.

ఇక సూపర్ స్టార్ కోసం అదిరిపోయే స్టోరీ రెడీ చేశాడట నెల్సన్. ఈ సినిమాలో రజినీకాంత్ భార్యగా ఐశ్వర్య రాయ్ నటిస్తుందని వార్తలు వస్తుంది. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర నరసింహ సినిమాలో తరహాలో ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో మరో కీలక  పాత్ర కోసం ప్రియాంక అరుళ్ మోహన్ నటించనుందట.. ఓ యంగ్ హీరోకు జోడీగా నటించనుందని అంటున్నారు.అలాగే ఈ మూవీకి కేఎస్ రవికుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చడం మరో విశేషం. ఇక యంగ్ మ్యుజిషియన్ అనిరుద్ పవర్ఫుల్ మ్యూజిక్ అందించనున్నారట.

ఇవి కూడా చదవండి