Rajinikanth’s Peddanna: “పెద్దన్న”గా సూపర్ స్టార్.. దుమ్మురేపుతున్న మోషన్ పోస్టర్..
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నతే. ఈ సినిమా కోసం రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Super Star Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నతే. ఈ సినిమా కోసం రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బు కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా కారణంగా షూటింగ్ కు ఆలస్యం అవ్వడంతో సినిమా విడుదల పై రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న చిత్రయూనిట్ సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులో పెద్దన్న అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.
తాజాగా సినిమానుంచి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. నాడి నరము నిప్పులు చెరగ.. రక్తం మొత్తం సలసల మరగ.. రంగస్థలమే దద్దరిల్లాగా.. మొదలైంది ఓంకార తాండవం.. అంటూ బ్యాగ్రౌండ్ లో వాయిస్ ఓవర్ వస్తుండగా.. రజినీకాంత్ బైక్ పైన చేతిలో కట్టిపట్టుకొని ఉన్న పవర్ ఫుల్ లుక్ ను రివీల్ చేశారు. ఇక ఈ మోషన్ పోస్టర్ కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ మోషన్ పోస్టర్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :