AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Spirit: ఒక సినిమా అనేక పుకార్లు.. ప్రభాస్‌ ‘స్పిరిట్‌’పై ఎన్ని వార్తలో.. ప్రచారంలో ఉన్న ఆ వార్తలు ఇవే..

Prabhas Spirit: ఇప్పుడు ప్రభాస్‌ స్థాయి అంతర్జాతీయం ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే నేషనల్‌ మీడియాతో పాటు కొన్ని ఇతర దేశాల్లోనూ వార్తగా మారుతోంది. ముఖ్యంగా...

Prabhas Spirit: ఒక సినిమా అనేక పుకార్లు.. ప్రభాస్‌ 'స్పిరిట్‌'పై ఎన్ని వార్తలో.. ప్రచారంలో ఉన్న ఆ వార్తలు ఇవే..
Prabhas
Narender Vaitla
|

Updated on: Oct 22, 2021 | 7:20 PM

Share

Prabhas Spirit: ఇప్పుడు ప్రభాస్‌ స్థాయి అంతర్జాతీయం ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే నేషనల్‌ మీడియాతో పాటు కొన్ని ఇతర దేశాల్లోనూ వార్తగా మారుతోంది. ముఖ్యంగా బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ స్టామినా ఒక్కసారిగా పెరిగిపోయింది. చైనా, జపాన్‌తో పాటు పలు దేశాల్లోనూ ఆయా భాషల్లో విడుదలై బాహుబలి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ప్రభాస్‌ చిత్రానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఆయన అభిమానులు ఎక్కడ లేని ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన హీరోగా ప్రకటించిన కొత్త చిత్రం ‘స్పిరిట్‌’పై నెట్టింట పలు వార్తలు హల్చల్‌ చేస్తున్నాయి.

అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రభాస్‌కు 25వ ప్రాజెక్టు. ఈ సినిమాను భారతీయ భాషల్లోనే కాకుండా చైనా, జపాన్‌తో పాటు మరికొన్ని దేశాల లాంగ్వేజ్‌లోనూ విడుదల చేయనున్నట్లు సినిమా పోస్టర్‌లో సందీప్‌ తెలియజేశారు. ఇంకా షూటింగ్‌ కూడా ప్రారంభం కాని ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి పలు ఆసక్తిర విషయాలు హల్చల్‌ చేస్తున్నాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తోన్న వార్తలు.. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రభాస్‌ ఏకంగా రూ. 150 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకోనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

Prabhas Spiritఅంతేకాకుండా.. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్ నటించనుందని కూడా వార్తలు వచ్చాయి, అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు కరీనా విలన్‌ పాత్రలో నటించట్లేదని, విలన్‌గా కనిపించనుందని మరో వార్త వస్తోంది. ఇక ఈ సినిమాలో స్పోర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కనుందని, ఇందులో ప్రభాస్‌ రన్నర్‌గా కనిపించనున్నాడని టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఒక్కదానిపై కూడా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాక పోవడం గమనార్హం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: TDP News: దాడి ఘటనపై టీడీపీ నేతల అంతర్మథనం.. చంద్రబాబు నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

TDP Anitha: అనిల్ కుమార్ యాదవ్‌కు వార్నింగ్ ఇచ్చిన మహిళ అధ్యక్షురాలు అనిత.. వీడియో

ACB Raids: మాజీ సీఎం సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు..