Rajinikanth Birthday : హ్యాపీ బర్త్ డే తలైవా.. వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజినీకాంత్

కానీ ఆయన అభిమానులు కోట్లల్లో ఉంటారు.ఇప్పటి హీరోలందరూ తనని ఫాలో అయ్యేట్టు చేస్తాడు. నటనలో స్టైల్ లో రజినీకాంత్ ను కొట్టే హీరో ఇంతవరకు లేడు.. ఇక పై రాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Rajinikanth Birthday : హ్యాపీ బర్త్ డే తలైవా.. వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజినీకాంత్
Rajinikanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 12, 2022 | 7:08 AM

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఇతర హీరోల్లో ఆయన అందంగా ఉండరు. కండలు తిరిగిన బాడీ ఉండదు. కానీ ఆయన అభిమానులు కోట్లల్లో ఉంటారు.ఇప్పటి హీరోలందరూ తనని ఫాలో అయ్యేట్టు చేస్తాడు. నటనలో స్టైల్ లో రజినీకాంత్ ను కొట్టే హీరో ఇంతవరకు లేడు.. ఇక పై రాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మ్యానరిజంతో బాక్సాఫీస్‌ను సింగిల్ హ్యాండ్‌తో శాసించగల వన్ అండ్ ఓన్లీ హీరో రజినీకాంత్ . నేడు ఈ సూపర్ స్టార్ పుట్టిన రోజు. రజినీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. 1975 లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ సినిమాతో తన ప్రస్థానం ప్రారంభించారు సూపర్ స్టార్. ఇప్పటికి హీరోగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు రజిని. నవ్వులో వైవిధ్యం, నడకలో వేగం, గొంతులో గాంభీర్యం, మ్యానరిజంలో మాస్ అప్పియరెన్స్తో ప్రేక్షకులను కట్టి పడేశారు సూపర్ స్టార్.

రజినీకాంత్ గురించి ఎంత చెప్పిన ఇంకా ఎదో ఒకటి మిగిలిపోతుంది. అంతలా సినీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించారు.  ఆయన ప్రయోగాలకు మారుపేరుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 1978 లో రజినీకాంత్ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన 20 సినిమాలు విడుదలయ్యాయి.

సినిమా రంగానికి సూపర్ స్టార్ చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఆయనను పద్మభూషణ్ తో సత్కారించింది. అలాగే  2016 లో పద్మవిభూషణ్ పురస్కారాన్నీ బహుకరించింది. ఇక ఒక జాతీయ పురస్కారం, ఏడు సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్ం ఫేర్ పురస్కారంతో పాటు మరిన్ని పురస్కారాలు అందుకున్నారు రజినీకాంత్. నేటితో రజినీకాంత్ 72వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన బాబా సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..