PM Modi: ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీని చూడనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడు.? ఎక్కడంటే.?
విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో ఇటీవల విడుదలైన చిత్రం 'ది సబర్మతి రిపోర్ట్'. ఈ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాదు..
విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో ఇటీవల విడుదలైన చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’. ఈ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాదు.. అన్ని చోట్లా హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఈ మూవీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీక్షించనున్నారు. డిసెంబర్ 2వ తేదీన సాయంత్రం ఢిల్లీలోని బాలయోగి ఆడిటోరియంలో ఆయన ఈ చిత్రాన్ని చూడనున్నారు.
2002లో గుజరాత్లో చోటు చేసుకున్న గోద్రా సంఘటన ఆధారంగా ‘ది సబర్మతి రిపోర్ట్’ అనే సినిమాను తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. గోద్రా ఘటన తర్వాత మీడియా ఎలా వ్యవహరించింది? అసలు ఏం జరిగింది? దాన్ని కప్పిపుచ్చడానికి ఎలా ప్రయత్నించారు? అనే ఆసక్తికర అంశాలను ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాలో చూపించారు మేకర్స్.
విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు గతంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అభినందనలు తెలిపారు. ‘ఇలాంటి నిజం బయటకు రావాలి’ అని ట్వీట్ కూడా చేశారు. నరేంద్ర మోదీ ప్రశంసల నేపథ్యంలో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ తర్వాత మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలోనూ ఇప్పుడు ఈ మూవీకి పన్ను మినహాయింపు ప్రకటించారు.
ఈ సినిమాపై గతంలో ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. ‘నిజం బయటకు రావడం చాలా బాగుంది. అందులోనూ సామాన్యులు చూసి అర్థం చేసుకోగలిగే నిజం మీడియా ద్వారా బయటకు వస్తోంది. తప్పుడు ప్రకటనలు, కథనాలు కొంత కాలం మాత్రమే మనుగడలో ఉంటాయని, ఎప్పుడో ఒకప్పుడు నిజం బయటకు రావాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాకు ధీరజ్ సర్నా దర్శకత్వం వహించారు. విక్రాంత్ మాస్సే, టాలీవుడ్ హీరోయిన్ రాఖీ ఖన్నా, రిద్ది డోగ్రా, బర్కా సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా నవంబర్ 15న థియేటర్లలో విడుదలైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..