Sarkaru Vaari Paata: అన్నీ మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ప్లే అవ్వనున్న మహేష్ పాట.. సర్కారు వారి పాట నయా ట్రెండ్
పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన వస్తున్న ప్రతి ఒక్క అప్‌డేట్‌తో అంచనాలను పెంచుతోంది. మొదటిగా, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది, ఇందులో మొదటి సింగిల్ ఇప్పటికీ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. ఆతర్వాత వచ్చిన పెన్నీ సాంగ్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ పాటలో ఇందులో మహేష్ బాబు కుమార్తె ప్రిన్సెస్ సితార ఘట్టమనేని కూడా ఉన్నారు. సితార మ్యూజిక్ వీడియోలో కనిపించడం ఇదే తొలిసారి. మహేష్ బాబు సితార క్యూట్ నెస్, స్టైలిష్, ట్రెండీ డ్యాన్స్ మూమెంట్స్ మంత్రముగ్ధులను చేస్తుంది. ఆమె డాన్స్ తో పాటు మహేష్ బాబు కూడా కనిపించడం అభిమానులకుఉత్సాహాన్ని ఇచ్చింది.ఈపాట వెండితెరపై అభిమానులకు ఫీస్ట్ లా ఉంటుంది
ఇప్పుడు పెన్నీ సాంగ్ అన్ని మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. గాన, స్పాటిఫై, హంగామా వంటి మరిన్ని మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్ లో పెన్నీ సాంగ్ ప్లే అవ్వనుంది. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సినిమా నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ సినిమా కోసం తమన్ చక్కటి బాణీలు అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.
The much loved #Penny now streaming on all platforms ?? !
Hit play here ▶️ https://t.co/p5YOJOlaGD@urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @MythriOfficial @AzizNakash @IananthaSriram @saregamasouth#SarkaruVaariPaata #PennySong #SaReGamaTelugu pic.twitter.com/NWxMWSNKjO
— BA Raju’s Team (@baraju_SuperHit) April 8, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :