Mahesh Babu: అమ్మ కోసం అన్నీతానై.. చివరిరోజుల్లో తల్లితోనే గడిపిన సూపర్ స్టార్..

|

Sep 30, 2022 | 1:12 PM

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఎస్ఎస్ఎంబీ28. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ నటిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahesh Babu: అమ్మ కోసం అన్నీతానై.. చివరిరోజుల్లో తల్లితోనే గడిపిన సూపర్ స్టార్..
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఎస్ఎస్ఎంబీ28. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ నటిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఇప్పుడు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ కొంత గ్యాప్ తీసుకున్నారు. విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా షూటింగ్ లో పాల్గొనలేదు. చాలా టైం తీసుకున్నారు. సినిమా లేట్‌ పై ఫ్యాన్స్ అందరూ నిరాశను వ్యక్తం చేశారు. సినిమా లేట్‌కు కారణం త్రివిక్రమే అంటూ… ఆయన్ను నిందించారు. కాదు మహేష్ యాడ్ షూట్స్ తో బిజీ అయ్యారు అని కూడా అలిగారు. కాదు కాదు ఓ ఫేమస్‌ యాక్టర్ డేట్స్ వల్లే అంటూ.. నెట్టింట ఓ న్యూస్‌ను వైరల్ చేశారు. ఇక తాజాగా అసలు విషయం తెలుసుకుని చాలా ఫీలవుతున్నారు మహేష్ ఫ్యాన్స్. అమ్మ కోసం ప్రిన్స్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మరొకొంత మంది ఎమోషనల్ కూడా అవుతున్నారు.

ఇక అమ్మ ఇందిరా దేవిని దైవంగా భావించే మహేష్‌.. ఆమె చివరి రోజుల్లో ఆమె పక్కనే ఉండాలని కోరుకున్నారట. ఆ క్రమంలోనే గత కొద్ది రోజులుగా తల్లి వెన్నంటే ఉంటున్నారట మన ప్రిన్స్. ఏఐజీ హాస్పటల్ నుంచి ఇందిరా దేవి డిస్చార్జ్‌ అయినప్పటి నుంచి ఆమెకు సేవ చేస్తూనే ఉన్నారట. ఇక ఆ కారణంతోనే త్రివిక్రమ్‌ సినిమాను కొద్ది రోజుల వరకు హోల్డ్ చేశారట మహేష్.

ఇక మహేష్ తల్లి అనారోగ్యం గురించి త్రివిక్రమ్ కూడా.. మహేష్ నిర్ణయానికి మద్దతుగా ఉన్నారట. షూట్‌ను ఆపేశారట. కాని ఆ తల్లి మరణించడం… మహేష్ దుఖంలో మునిగిపోవడంతో.. ఇప్పుడీ న్యూస్ కొంత మంది ఇండస్ట్రీ పీపుల్‌ నోటి నుంచి బయటికి వచ్చింది. నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం మహేష్ తల్లిపోయిన బాధలో ఉన్నారు. ఆ బాధనుంచి తేరుకోవడానికి.. తిరిగి షూట్ లో జాయిన్ అవ్వడానికి మరికొంత సమయం తీసుకోనున్నారు మహేష్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..