
ఓటీటీ పుణ్యమా అని ఇప్పుడు కొత్త సినిమాలు కూడా ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. అలా థియేటర్స్ లో విడుదలైన సినిమాలు కొన్ని నెలలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు.. హిందీ, తమిళ్, కన్నడ, తమిళ్ సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. వీటితో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా మన దగ్గర సత్తా చాటుతున్నాయి. టాలీవుడ్ లో హాలీవుడ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సూపర్ హీరోల సినిమాలు గతంలో ఎన్నో హాలీవుడ్ సినిమాలు తెలుగలో డబ్ అయ్యి భారీ కలెక్షన్లు రాబట్టాయి.
ఇక తెలుగులో మార్కెట్ ను పెంచుకునేందుకు, ఇక్కడి ఆడియెన్స్ కు మరింత చేరువ అయ్యేందుకు సినిమాలను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పుడు థియేటర్స్ లో దుమ్మురేపుతున్న సినిమా ఎదో కాదు సూపర్ మాన్. హాలీవుడ్ లో తెరకెక్కిన సూపర్ మాన్ సినిమాకు ఫ్యాన్ బేస్ వేరే లెవల్ లో ఉంటుంది. ఈ క్రమంలో సూపర్ మాన్ సినిమాలన్నీ మన దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా వచ్చిన సూపర్ మాన్ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. జులై 11న విదులైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్ట్ చేసింది.
రూ.5090 కోట్లు కలెక్ట్ చేసింది సూపర్ మాన్ సినిమా.. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది. ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సూపర్ మాన్ సినిమా విడుదలై ఐదువారాలు అవుతుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది. తాజాగా సూపర్ మాన్ దర్శకుడు జేమ్స్ గన్ సోషల్ మీడియా వేదికగా సూపర్ మాన్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. సూపర్ మ్యాన్ ఈ శుక్రవారం, 8/15 మీ ఇళ్లకు వస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆగస్టు 15 నుంచి సూపర్ మ్యాన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, ఫాండాంగో ఎట్ హోమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
#Superman is coming to your homes this Friday, 8/15. Available now for pre-order. Or catch it while it’s still in theaters! pic.twitter.com/xziRucg3xG
— James Gunn (@JamesGunn) August 12, 2025
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి