Sarkaru Vaari Pata: సర్కారు వారి పాట సాంగ్స్ అదిరిపోనున్నాయట.. రింగ్ టోన్స్ కూడా మార్చేస్తారంటూ హింట్..

|

Jan 24, 2022 | 5:08 PM

మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న  మహేష్ మరోసారి సర్కారు వారి పాట సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు.

Sarkaru Vaari Pata: సర్కారు వారి పాట సాంగ్స్ అదిరిపోనున్నాయట.. రింగ్ టోన్స్ కూడా మార్చేస్తారంటూ హింట్..
Mahesh
Follow us on

Sarkaru Vaari Pata: మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న  మహేష్ మరోసారి సర్కారు వారి పాట సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రతి పోస్టర్ సర్కారు వారి పాట పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో కానిపించబోతున్నారు. ఇక ఈ సినిమాపై ఇప్పుడు కరోనా ప్రభావం ఎక్కువగానే చూపిస్తుంది. ఇటీవల మహేష్ బాబు మోకాలి సర్జరీ జరగడం.. ఆ తర్వాత.. మహేష్.. కీర్తి సురేష్ కరోనా బారిన పడడంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక అటు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఎక్కడ చూసిన తమన్ పేరు, ఆయన మ్యూజిక్ మారు మోగుతున్నాయి. అఖండ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. అలాగే భీమ్లానాయక్ నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ప్రముఖ గాయిని గీతా మాధురి మరియు తమన్ లు ఇన్ స్టా గ్రామ్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో సర్కారు వారి పాటకు సంబంధించిన అప్ డేట్ ను కూడా ఇచ్చాడు. అలాగే తమన్ మాట్లాడుతూ.. సర్కారు వారి పాట సినిమాలోని ఒక పాట ఫ్యాన్స్ ట్యూన్స్ తో మొబైల్స్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం అంటూ హింట్ ఇచ్చారు. అలాగే గీతామాధురి మాట్లాడుతూ.. సినిమాలో ఓ పాట ఉంటుంది. అది రిలీజ్ అయితే అందరి రింగ్ టోన్స్, కలర్ టోన్స్ అదే పాట ఉంటుంది అని తెలిపారు. దాంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నాం అని చెప్పారు తమన్.  ఇంకా తమన్ లైవ్ లో చాల విషయాలు పంచుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ranga Ranga Vaibhavanga: రంగ రంగ వైభవంగా అంటూ వచ్చేస్తున్న మెగా హీరో.. టైటిల్ టీజర్ విడుదల చేసిన వైష్ణవ్ తేజ్.. 

Viral Video : హాలీవుడ్‌ పాటకు భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టిన పెళ్లి కూతురు..!

Vishnu Priya: సమంత పాటకు విష్ణుప్రియ రిహర్సల్ అదుర్స్.. ఊ అంటావ మావ అంటూ రచ్చ..