సన్నీలియోన్ ఈ పేరు తెలియని కుర్రాడు ఉంటాడా.. అంతలా యువత మనసు దోచేసింది ఈ భామ. బాలీవుడ్ లో హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న సన్నీ. తెలుగులోనూ నటించింది. స్పెషల్ పాత్ర..లేదంటే స్పెషల్ సాంగ్స్ తో యువతరాన్ని ఉర్రూతలూగించింది. మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది సన్నీ. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన గరుడ వేగ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసి కుర్రకారును కట్టిపడేసింది. ఆతర్వాత సన్నీ తెలుగు సినిమాలపైన పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తిరిగి తెలుగు సినిమాలో చేయబోతుందని టాక్. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది సన్నీ డైరెక్ట్ గా తెలుగు సినిమాలో కనిపించడం లేదట.
కన్నడ ఇండస్ట్రీలో వై.రాజ్కుమార్ దర్శకత్వం లో `కాటన్ పేట్ గేట్` అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సన్నీ లియోన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుందట. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో `సీతన్నపేట్ గేట్`గా కూడా తీస్తున్నారు. ఈ పాట షూటింగ్ ఈ నెల ఆఖరును హైదరాబాద్ లో షూట్ చేయనున్నారట. సన్నీ ప్రత్యేక పాట సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుందని చిత్రయూనిట్ చెప్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :