Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ పై ఉమైర్ సంధు రివ్యూ.. సీరియస్ అయిన సుహాసిని

|

Sep 30, 2022 | 12:34 PM

కావాలనే కొందరు సినిమా పై నెగిటివ్ ప్రచారాలు, తప్పుడు రివ్యూలు ఇస్తూ ఉంటారు. ఇక ఉమైర్ సంధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ పై ఉమైర్ సంధు రివ్యూ.. సీరియస్ అయిన సుహాసిని
Suhasini , Umair Sandhu
Follow us on

ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే దానిపై రివ్యూలు ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉంటారు. కొందరు ఉన్నది ఉన్నటు చెప్తే మరికొంతమంది మాత్రం కావాలనే సినిమాపై నెగిటివ్ రివ్యూస్ ఇస్తుంటారు. సినిమాలో కంటెంట్ ఉంటే నెగిటివ్ రివ్యూస్ కూడా పెద్దగా పనిచేయవు అది వేరే విషయం అనుకోండి.. కానీ కావాలనే కొందరు సినిమా పై నెగిటివ్ ప్రచారాలు, తప్పుడు రివ్యూలు ఇస్తూ ఉంటారు. ఇక ఉమైర్ సంధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతగాడు తన రివ్యూస్ తో నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంటాడు. సినిమా రిలీజ్ అయితే వెంటనే ఆ సినిమా రివ్యూ సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తూ ఉంటాడు. కొన్ని సార్లు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి విమర్శల పలు కూడా అయ్యాడు. దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిని అని చెప్పుకునే ఉమైర్ సంధు తాజాగా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమా పై రివ్యూ ఇచ్చాడు. సినిమా విడుదలకు ముందే ఉమైర్ తన రివ్యూను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.

ఈ మేరకు అతడు.. “పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ రివ్యూ.. అద్భుతమైన ప్రొడక్షన్ డిజైనింగ్ , వీఎఫ్ఎక్స్ సూపర్ గా ఉన్నాయి. చియాన్ విక్రమ్, కార్తీ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఐశ్వర్యారాయ్ బచ్చన్ మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఆమె నటన అద్భుతంగా ఉంది. మొత్తం మీద, కొన్ని ట్విస్ట్‌లతో కూడిన మంచి హిస్టారికల్ స్టోరీతో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించేలా ఉంది” అంటూ రాసుకొచ్చాడు. ఈ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఈ రివ్యూ పై మణిరత్నం సతీమణి సుహాసిని ఫైర్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

అసలు మీరు ఎవరు..? ఇంకా రిలీజ్ కానీ సినిమా పై మీరు ఎలా చూశారు.? ఎలా రివ్యూ ఇస్తారు.? అంటూ మండిపడ్డారు సుహాసిని. దీని పై నెటిజన్లు కూడా ఉమైర్ పై సీరియస్ అవుతున్నారు. ఇక ప్రిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేల నాటి చోళుల కథాంశంతో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని రూపొందించారు మణిరత్నం. ప్రసిద్ధ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ పై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..