AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudigali Sudheer: 14 ఏళ్ల ప్రేమ.. నన్ను డిస్టర్బ్ చేయకు అంది.. సుడిగాలి సుధీర్ బ్రేకప్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు

ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు వెండితెరపై హీరోగానూ కనిపిస్తున్నాడు సుడిగాలి సుధీర్. అతను నటించిన గోట్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఓ షోలో తన లవ్, బ్రేకప్ స్టోరీ చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు సుడిగాలి సుధీర్.

Sudigali Sudheer: 14 ఏళ్ల ప్రేమ.. నన్ను డిస్టర్బ్ చేయకు అంది.. సుడిగాలి సుధీర్ బ్రేకప్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు
Sudigali Sudheer
Basha Shek
|

Updated on: Apr 28, 2026 | 4:04 PM

Share

జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై బిజీ బిజీగా ఉన్న ఆర్టిస్టుల్లో అతను కూడా ఒకడు. ప్రస్తుతం టీవీ షోస్, ఓటీటీ షోలకు హోస్ట్ గా కొనసాగుతోన్న సుధీర్ మరోవైపు హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. సాఫ్టవేర్ సుధీర్, త్రీ మంకీస్, కాలింగ్ సహస్ర, గాలోడు సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ త్వరలోనే గోట్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. కాగా సినిమాల సంగతి పక్కన పెడితే సుధీర్ పెళ్లి వార్తలు కూడా తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. జబర్దస్త్ యాంకర్ రష్మీ తో అతను ప్రేమలో ఉన్నాడని, ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం కూడా జరుగుతుంటుంది. అయితే అవి కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి. అయితే సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి తన బ్రేకప్ స్టోరీ కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఇప్పటికే తన ఫస్ట్ లవ్, బ్రేకప్ గురించి పలు సార్లు చెప్పుకొచ్చిన సుధీర్ మరోసారి ఈ విషయంపై స్పందించాడు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న సర్కార్ ఎపిసోడ్ లో తన ప్రేమ, బ్రేకప్ స్టోరీ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు,

‘నా ఫస్ట్ లవ్ 14 ఏళ్లు రిలేషన్ షిప్. స్కూల్ నుంచే పరిచయం, ప్రేమ. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటున్నాను. అదే సమయంలో తను వేరే వాళ్లను పెళ్లి చేసుకుంది అని తెలిసింది. ఎందుకు అని అడిగాను. నేను హ్యాపీగా ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకు అంది. అంతే.. తనతో ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. బాధతో నెక్లెస్ రోడ్ లో పరిగెత్తాను ఆ రోజు’ అంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు సుధీర్.

కాగా గతంలోనూ ఒకసారి తన ప్రేమ, బ్రేకప్ స్టోరీ గురించి స్పందిస్తూ.. ‘ఆ సమయంలో తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నాకు తెలియదు. కానీ నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. అయితే ఆ సమయంలో నా మీద ఆధారపడి ఉన్న ఫ్యామిలీ ఉన్నారు కాబట్టే నేను వర్క్ చేసి ఇవాళ ఇక్కడ ఉన్నాను. తను ఆ రోజు బ్రేకప్ చెప్పకపోతే ఇవాళ నేను ఇంత సక్సెస్ అవ్వలేను ఏమో. ఇవాళ ఇంతమంది ప్రేమ పొందుతున్నందుకు తనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి అని’ చెప్పుకొచ్చాడు సుధీర్. ప్రస్తుతం ఈ జబర్దస్త్ హీరో కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. సుధీర్ నటించిన గోట్ సినిమా (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్ టైమ్స్) ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈ మూవీ వాయిదా పడింది. ఇందులో సుధీర్ సరసన దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి వేదవ్యాస్‌ దర్శకుడు. చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us