Sudhakar Komakula: ఆ దర్శకుడు ఫోన్ చేసి సినిమాలో ఓ రోల్ చేయమంటే నేను చేయను అని చెప్పా..

సుధాకర్ కోమాకుల... 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో నాగరాజుగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ హీరో. ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలతోనూ, నటుడిగా 'క్రాక్'తోనూ

Sudhakar Komakula: ఆ దర్శకుడు ఫోన్ చేసి సినిమాలో  ఓ రోల్ చేయమంటే నేను చేయను అని చెప్పా..
Sudhakar Komakula
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 11, 2021 | 6:17 AM

Sudhakar Komakula: సుధాకర్ కోమాకుల… ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నాగరాజుగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ హీరో. ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలతోనూ, నటుడిగా ‘క్రాక్’తోనూ పేరు తెచ్చుకున్నారు. ‘రాజా విక్రమార్క’ సినిమాతో ఈ శుక్రవారం ఏసీపీగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ఇందులో హీరో ఎన్ఐఏ ఏజెంట్ రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. సుధాకర్ కోమాకుల ఏసీపీ రోల్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ..

దర్శకుడు శ్రీ సరిపల్లి సుమారు పదేళ్లు నుంచి తెలుసు. అమెరికాలో చాలా సినిమాలకు పని చేశాడు. అక్కడ నన్ను రెండు మూడు సినిమాలకు ఆడిషన్ చేశాడు. కెరీర్ పరంగా చూసినా… నేను ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చేసినప్పుడు అతను సహాయ దర్శకుడిగా వేరే సినిమాలకు పని చేసేవాడు. నా ‘నువ్వు తోపురా’ సినిమాకు చీఫ్ అసోసియేట్ గా పని చేశాడు. అలా మా మధ్య పరిచయం మరింత బలపడింది. ఈ సినిమా అనుకుంటున్న సంగతి నాకు తెలుసు. కార్తికేయతో ఓకే అయ్యిందని చెప్పాడు. ఒకరోజు ఫోన్ చేసి ‘నువ్వు ఓ రోల్ చేయాలి’ అన్నాడు. ‘నేను చేయను. హీరోగా సినిమాలు చేస్తున్నాను’ అని చెప్పా. ‘చాలా మంచి రోల్. నీకు బావుంటుంది’ అని అన్నాడు. నాకు ఆల్రెడీ రోల్ గురించి తెలుసు. ‘నువ్వు తోపురా’ సినిమా తర్వాత నాకు కొంచెం బ్రేక్ వచ్చింది. హీరోగా సినిమాలు చేస్తూ మధ్యలో ‘క్రాక్’, ఈ ‘రాజా విక్రమార్క’ చేశా అన్నారు. సినిమా పరంగా చెప్పాలంటే… కీలకమైన పాత్ర నాది రాజావిక్రమార్క లో.. గోవింద్ అని ఏసీపీ రోల్ చేశా. ఇప్పటివరకూ సరదా పాత్రలు చేశా. ఇందులో నా పాత్ర గంభీరంగా ఉంటుంది. హీరో సహా మిగతా నటీనటులు అందరితోనూ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. లుక్ బావుందని అందరూ ప్రశంసిస్తున్నారు అని చెప్పుకొచ్చారు సుధాకర్.

మరిన్ని ఇక్కడ చదవండి :  

AP Film Exhibitors: మంత్రి పేర్ని నానితో ముగిసిన సినీ ఎగ్జిబిట‌ర్ల సమావేశం.. ఆన్‌లైన్ టికెట్ విధానానికి అంగీకారం

RRR Movie Song: నాటు సాంగ్‌కు సెలబ్రెటీలు ఫిదా.. మెంటలెక్కిందన్న సమంత, వెయిట్ చేయలేనంటున్న సిద్ధార్ద్..

Rakul Preet Singh: డిఫరెంట్ లుక్స్ తో మతిపోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?