Tollywood: అయ్యో ఏమైంది? వీల్ చైర్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కనీసం నడవలేని స్థితిలో.. వీడియో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వీల్ చైర్ లో కనిపించింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆమె ఆమె కనీసం నడవలేని స్థితిలో ఉండడం చూసి అభిమానులు షాక్ తిన్నారు. తమ అభిమాన హీరోయిన్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

Tollywood: అయ్యో ఏమైంది? వీల్ చైర్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కనీసం నడవలేని స్థితిలో.. వీడియో వైరల్
Tollywood Actress

Updated on: Jan 22, 2025 | 11:36 AM

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నవీల్ చైర్ లో ప్రత్యక్షమైంది. బుధవారం (జనవరి 22) శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమె కనీసం నడవలేకపోయారు. కారు దిగేటప్పుడు కూడా ఒంటి కాలితోనే ఇబ్బంది పడుతూ నడిచారు. ఇటీవల జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా రష్మిక మందన్న కాలు బెణికింది. అయితే అప్పుడు గాయం చిన్నదేనని అనుకున్నారు. అయితే ఎయిర్ పోర్టులో రష్మిక పరిస్థితి చూస్తుంటే గాయం పెద్దదిగానే, తీవ్రంగానే ఉన్నట్లు సమాచారం. ఎయిర్ పోర్టులో రష్మిక లేటెస్ట్ విజువల్స్, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతు్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. రష్మిక మందన్న త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. కాగా గతేడాది పుష్ప 2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సినిమాను ఖాతాలో వేసుకుంది రష్మిక మందన్నా. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా ఏకంగా రూ.1850 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టేసింది. ఈ మూవీలో శ్రీవల్లిగా రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంది. విమర్శకులు సైతం నేషనల్ క్రష్ నటనపై ప్రశంసలు కురిపించారు.

రష్మిక మందన్నా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.  తెలుగులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న రష్మిక.. అటు హిందీలోనూ నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నట్లు  తెలుస్తోది. అందులో  ఛావా సినిమా ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ హిస్టారికల్ మూవీలో రష్మిక  సంభాజీ మహారాజ్ భార్య మహారాణి యసుబాయ్ పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా అభిమానుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. దీంతో పాటు ధనుష్, కుబేర, సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాల్లో నటిస్తోందీ అందాల తార. అలాగే రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ యాక్ట్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఎయిర్ పోర్టులో రష్మిక మందన్నా.. వీడియో..

ఛావా సినిమాలో రష్మిక లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.