
మహేష్ బాబు ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త వచ్చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్ జరుగుతోంది. ఇదే ఈవెంట్ లో మహేష్- రాజమౌళి సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈవెంట్ ప్రారంభంలోనే మహేష్ బాబు మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయడం వివేషం. గత కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ పలు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా రుద్ర, వారణాసి.. ఇలా పలు టైటిల్స్ వినిపించాయి. వీటిలో ఏది ఫిక్స్ చేస్తారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. చాలా మంది అనుకుంటున్నట్లే మహేష్ బాబు సినిమాకు ‘వారణాసి’ అని ఫిక్స్ చేశారు. ఈ మేరకు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో టైటిల్ గ్లింప్స్ వీడియోని ఈవెంట్ స్క్రీన్ పై ప్రసారం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు లుక్ అయితే అద్దిరిపోయిందని అభిమానులు చెబుతున్నారు.
కాగా వారణాసి సినిమాలో మహేశ్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మందాకిని పాత్రలో సందాడి చేయనుంది. ఇక మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, కుంభ అనే పవర్ ఫుల్ విలన్‌గా భయపెట్టనున్నాడు. ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటించనున్నారన్నది ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లోనే అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.
Edhi Chalu Saami 🔥🔥🔥🥵🥵🥵#GlobeTrotter #GlobeTrotterEvent pic.twitter.com/9cKkbKIcSQ
— GlobeTrotter Fan Club (@GlobetrotterOfl) November 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.