
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో దూకుడు ఒకటి. పోకిరి సినిమా తర్వాత మహేష్ కెరీర్ లో ఆ రేంజ్ హిట్ అయిన సినిమా దూకుడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాల తర్వాత మహేష్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఇక మహేష్ పని అయిపోయింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే టైం లో దూకుడు సినిమాతో అందరి నోళ్లు మూయించారు మహేష్. మహేష్ దెబ్బకు రికార్డులు బద్దలయ్యాయి. అల్ టైం రికార్డును క్రియేట్ చేసింది దూకుడు. ఇక ఈ సినిమాలో మహేష్ నటన, యాక్షన్ సీన్స్, కామెడీ ట్రాక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక ఈ మూవీకి తమన్ అందించిన సంగీతం వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పాలి. ఈ మూవీలో అన్ని సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికి కూడా ఈ మూవీ సాంగ్ వినిపిస్తున్నాయి అంటే తమన్ సంగీతంను ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయి చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీ దేత్తడి అనే మాస్ సాంగ్ ప్లేస్ లో తమన్ ముందు మరో సాంగ్ ను కంపోజ్ చేశారట.
అయితే ఆ సాంగ్ మెలోడీగా ఉండటంతో శ్రీనువైట్ల .. అక్కడ మాస్ సాంగ్ కావాలని పట్టుబట్టడంతో దేత్తడి సాంగ్ ను కంపోజ్ చేశారట. అయితే ఆ మెలోడీని మరో సినిమాలో వాడుకున్నారట తమన్. ఆ సాంగే రామ్ పోతినేని నటించిన కందిరీగ సినిమాలోని ”చంపకమాల నన్ను చంపకే బాల”.. ఈ విషయాన్నీ తమన్ స్వయంగా తెలిపారు. ఈ రెండు సాంగ్స్ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి.