Kota Bommali PS: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘కోట బొమ్మాళి పీఎస్’.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
తేజా మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. మలయాళీ సూపర్ హిట్ నాయాట్టు రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ 2 సంస్థ నిర్మించింది. నవంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి నిర్మాతలకు భారీ లాభాలను తీసుకువచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

చాలా కాలం తర్వాత సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. విడుదలకు ముందే ఈ సినిమాలోని లింగిడి అనే సాంగ్ సోషల్ మీడియాలో సెన్సెషన్ సృష్టించింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులేశారు. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకుండానే ఫుల్గా పబ్లిసిటీ వచ్చేసింది. తేజా మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. మలయాళీ సూపర్ హిట్ నాయాట్టు రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ 2 సంస్థ నిర్మించింది. నవంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి నిర్మాతలకు భారీ లాభాలను తీసుకువచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా న్యూఇయర్ వీకెండ్లో ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జనవరి 5న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. కానీ తర్వలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారట. ఇప్పటివరకు థియేటర్లలో మిస్ అయిన కోట బొమ్మాళి సినిమాను వచ్చే ఏడాది ఇంట్లోనే చూడొచ్చు.
#KotabommaliPS passes with flying colours at the box office and is getting terrific ratings from the public on @bookmyshow, @Paytm and @IMDb ❤️🔥❤️🔥
Book your tickets for the THRILLING BLOCKBUSTER now! – https://t.co/mnhtJDVB5M#BlockbusterKotabommaliPS #BunnyVass… pic.twitter.com/euRQp2MKIK
— SRIKANTH MEKA (@actorsrikanth) November 26, 2023
కథ విషయానికి వస్తే..
ఒక రాజకీయ నాయకుడి కారణంగా ముగ్గురి పోలీసుల జీవితాలు తారుమారవుతాయి. ఆ తర్వాత ఓరోజు రాత్రి ఈ ముగ్గురు ప్రయాణిస్తున్న కారు యాక్టిడెంట్ కావడం..ఆ ప్రమాదంలో నియజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణిస్తాడు. దీంతో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేయాలనే డిమాండ్ పెరుగుతుంది. దీంతో ఈ ముగ్గురి పోలీసుల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ?.. చట్టం చేతిలో వారి జీవితాలు ఏమయ్యాయి ?.. అనేది కోట బొమ్మాళి కథ. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మీ, శివాని, రాహుల్ విజయ్ తమ నటనతో ఆకట్టుకున్నారు.
The folk vibes are unstoppable! 🎶✨ #LingiLingiLingidi Lyrical Song from #KotabommaliPS hits a MASSive 50M+ views 🔥🔥🔥 on #YouTube.
🎶 https://t.co/Eu4n8pMcOw#KotabommaliPS @actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @DirTejaMarni @GA2Official @varusarath5 @bhanu_pratapa… pic.twitter.com/GTGOVfZiR6
— GA2 Pictures (@GA2Official) December 18, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




