AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth: ఆమె గొప్ప హీరోయిన్.. తనతో 6 సినిమాలు చేశాను.. నాకు బెస్ట్ కో స్టార్ తనే.. శ్రీకాంత్ ఎమోషనల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా.. ప్రస్తుతం సహయ నటుడిగా రాణిస్తున్నారు శ్రీకాంత్. అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఫుల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ సినీరంగంలో తన సినీ ప్రస్థానంలో బెస్ట్ కో-స్టార్‌ ఎవరనే విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా తనతో దాదాపు ఆరు సినిమాల్లో కలిసి నటించానని ఆమెను ఒక కుటుంబ సభ్యురాలిగా, అత్యంత సౌమ్యురాలిగా గుర్తుచేసుకున్నారు.

Srikanth: ఆమె గొప్ప హీరోయిన్.. తనతో 6 సినిమాలు చేశాను.. నాకు బెస్ట్ కో స్టార్ తనే.. శ్రీకాంత్ ఎమోషనల్..
Srikanth
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2026 | 5:11 PM

Share

ఒకప్పుడు హీరోగా.. ఇప్పుడు సహయ నటుడుగా వెండితెరపై సందడి చేస్తున్నారు శ్రీకాంత్. అప్పట్లో ప్రేమకథలు, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సహయ నటుడిగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ తన సినీ ప్రస్థానం గురించి చెప్పుకొచ్చారు. తెలుగు సినీ చరిత్రలో కొందరు నటీనటులు ఎప్పటికీ గుర్తుండిపోతారు. 80లు, 90లు, 2000లలో కూడా వారి పేర్లు మారుమోగుతూనే ఉంటాయి. అటువంటి గొప్ప నటీమణులలో దివంగత సౌందర్య ఒకరు. ఆమె లేని లోటు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను వెంటాడుతోంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ సౌందర్యతో తనకున్న అభిమానాన్ని, మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

శ్రీకాంత్ మాట్లాడుతూ, తన కెరీర్‌లో బెస్ట్ కో-స్టార్‌గా సౌందర్యను పేర్కొన్నారు. తాను ఆరు చిత్రాలలో సౌందర్యతో కలిసి నటించానని తెలిపారు. ఆమె కేవలం సహనటి మాత్రమే కాదని, ఒక కుటుంబ సభ్యురాలిగా తమ మధ్య అనుబంధం ఉండేదని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు. సౌందర్య తల్లిదండ్రులు, సోదరుడు సైతం తనకు చాలా సన్నిహితులని ఆయన చెప్పారు. సౌందర్య ఒక కుటుంబ అమ్మాయిలా, అత్యంత సౌమ్యురాలిగా ఉండేదని, చాలా మంది హీరోలు ఆమెను ఎంతో గౌరవించేవారని శ్రీకాంత్ అన్నారు. తన నటనతో ఆమె అప్పట్లో సావిత్రి గారిని గుర్తుచేసేదని, తెరపై ఆమెతో కలిసి నటిస్తున్నప్పుడు ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. సౌందర్యను అందరూ ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటారని శ్రీకాంత్ అన్నారు. ఆమె గొప్ప నటి అని, తెలుగు సినిమాకు ఆమె సేవలు మరువలేనివని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

శ్రీకాంత్, సౌందర్య జోడికి అప్పట్లో మంచి ఫాలోయింగ్ ఉండేది. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉండేది. తారకరాముడు, అనగనగా ఒక అమ్మాయి, కలిసి నడుద్దాం, నా మనసిస్తా రా, ప్రేమ ప్రయాణం, నిన్నే ప్రేమిస్తా వంటి చిత్రాల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

శ్రీకాంత్, సౌందర్య..

Srikanth, Soundarya

Srikanth, Soundarya

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Follow Us
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో