AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. సంతూర్‌ స్కాలర్‌షిప్‌ 2026-27కు ఇలా దరఖాస్తు చేయండి

సంతూర్‌ స్కాలర్‌షిప్‌ 2026-27 ప్రకటన విడుదలైంది. ఇంటర్‌ పూర్తి చేసి డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన అర్హులైన బాలికలకు విప్రో సంస్థ రూ.30,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులు అక్టోబర్‌ 15, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..

ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. సంతూర్‌ స్కాలర్‌షిప్‌ 2026-27కు ఇలా దరఖాస్తు చేయండి
Santoor Scholarship For Intermediate Pass Girls
Srilakshmi C
|

Updated on: Oct 09, 2026 | 6:16 AM

Share

గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన బాలికలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు విప్రో సంస్థకు చెందిన విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ గ్రూప్‌ (WCCLG), విప్రో కేర్స్‌ సంయుక్తంగా సంతూర్‌ స్కాలర్‌షిప్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షిప్‌ ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి, డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన అర్హులైన విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఒకేసారి రూ.30,000 ఆర్థిక సాయం అందుతుంది.

అర్హతలు ఇవే..

  • ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే పూర్తిచేసి ఉండాలి.
  • 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి.
  • 2025-26 విద్యా సంవత్సరంలోనే ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరి ఉండాలి.
  • కనీసం మూడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి ఉన్న డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి.

స్కాలర్‌షిప్‌ ఎంతంటే?

ఈ కార్యక్రమం కింద ఎంపికైన విద్యార్థినులకు రూ.30,000 మొత్తాన్ని ఒకేసారి స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. ఈ నగదును ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఖర్చులు, మెస్‌ ఫీజు, ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, స్టేషనరీ, డిజిటల్‌ పరికరాలు తదితర విద్యా సంబంధిత అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.

గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి ఈ స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్థినులు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా తమ అండర్‌గ్రాడ్యుయేట్‌ చదువులు పూర్తయ్యే వరకు స్కాలర్‌షిప్‌ ప్రయోజనాన్ని కొనసాగించవచ్చు. అర్హులైన విద్యార్థినులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు అర్హతలు, అవసరమైన పత్రాలు, ఇతర నిబంధనలను అధికారిక ప్రకటనలో పరిశీలించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థినులకు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఈ స్కాలర్‌షిప్‌ ఆర్థికంగా తోడ్పడుతుంది. అర్హత ఉన్న విద్యార్థినులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన వివరాలు..

  • స్కాలర్‌షిప్‌ పేరు: సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2026-27
  • ఆర్థిక సాయం: రూ.30,000 (ఒకేసారి)
  • అర్హత రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
  • చివరి తేదీ: అక్టోబర్‌ 15, 2026.

సంతూర్‌ స్కాలర్‌షిప్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. 
రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. 
బుధ-శని షడాష్టక యోగం.. ఈ 5 రాశులకు పరీక్షా సమయం!
బుధ-శని షడాష్టక యోగం.. ఈ 5 రాశులకు పరీక్షా సమయం!
దీపావళికి ముందే ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!
దీపావళికి ముందే ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!
F-1 విద్యార్థులకు షాక్.. ఓపీటీ ఫీజు $500 నుంచి $70,000కు పెంపు!
F-1 విద్యార్థులకు షాక్.. ఓపీటీ ఫీజు $500 నుంచి $70,000కు పెంపు!