OTT Movie: ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి మరో మైండ్ బెండింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ మను అశోకన్ ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించడం విశేషం. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (అక్టోబర్ 09) పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఎపిక్, మారెమ్మ వంటి తెలుగు సినిమాలతో పాటు ఖలీఫా, ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ వంటి డబ్బింగ్ సినిమాలు కూడా ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నాయి. అయితే వీటిలో ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మన నిత్య జీవితంలో జరిగే కొన్నినిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. గతంలో ‘ఉయిరే’, ‘కాణెక్కాణే’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ మను అశోకన్ ఈ సిరీస్ ను రూపొందించడం విశేషం. ఈ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే.. మహిళలపై జరిగే సైబర్ స్టాకింగ్, మానసిక వేధింపుల చుట్టూ తిరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ టీనా సెబాస్టియన్ నగరంలో మహిళలకు ఎదురవుతున్న కొన్ని విచిత్రమైన, భయానక కేస్‌లను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఈ కేస్ లోతుల్లోకి వెళ్ లేకొద్దీ క్రిమినల్స్ సైకాలజీని అర్థం చేసుకోవడానికి సైకియాట్రిస్ట్‌లు, మెంటల్ హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు టీనాతో చేతులు కలుపుతారు. ప్రేమ, అభిమానం పేరుతో జరిగే ముసుగులో నియంత్రణ, భయం, అసలైన సైకో ఆటిట్యూడ్ ఎంత ప్రమాదకరంగా ఉంటాయో దర్శకుడు చాలా రా అండ్ రియలిస్టిక్‌గా ఈ సిరీస్ లో చూపించారు.
ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ పేరు ‘ఐస్’ (Eyes). నేషనల్ అవార్డ్ విన్నర్ కని కుసృతి ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ రోల్ పోషించారు. ఆమెతో పాటు నిఖిలా విమల్, శ్రుతి రామచంద్రన్, సానియా ఇయ్యప్పన్, దేవ్ మోహన్ వంటి సౌత్ పాపులర్ స్టార్స్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. డ్రీమ్ క్యాచర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై టి.ఆర్. షంషుద్దీన్ ఈ సిరీస్ ను నిర్మించారు. అంజనా నాయర్ అందించిన ఈ ఒరిజినల్ స్టోరీకి బాబీ-సంజయ్ పవర్ ఫుల్ స్క్రీన్‌ప్లే సమకూర్చారు. రంజిన్ రాజ్ ఈ సిరీస్ కు సంగీతం సమకూర్చారు. గౌతమ్ శంకర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఐస్ వెబ్ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ వీకెండ్ లో మంచి ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ సినిమా కానీ వెబ్ సిరీస్ చూడాలనుకునేవారికి ఐస్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
సోనీ లివ్ లో స్ట్రీమింగ్..
#Eyes (2026) | Malayalam | series | 7 Episodes
Streaming Now on sony liv….
Audio: Tamil, Telugu, Hindi, Malayalam https://t.co/IeTtaGIztj
— KUDALINGAM MUTHU (@KUDALINGAM49671) October 8, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




