Srikanth Addala: బెల్లంకొండను డైరెక్ట్ చేయబోతున్న నారప్ప డైరెక్టర్.. శ్రీకాంత్ అడ్డాల చేతికి కర్ణన్ రీమేక్..?

|

May 20, 2021 | 2:08 PM

బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వరుస గా సినిమాలు చేస్తున్నప్పటికీ బెల్లంకొండ శ్రీనివాస్ కు మాత్రం సాలిడ్ హిట్ దక్కడం లేదు..

Srikanth Addala: బెల్లంకొండను డైరెక్ట్ చేయబోతున్న నారప్ప డైరెక్టర్.. శ్రీకాంత్ అడ్డాల చేతికి  కర్ణన్ రీమేక్..?
Follow us on

Srikanth Addala:

బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వరుస గా సినిమాలు చేస్తున్నప్పటికీ బెల్లంకొండ శ్రీనివాస్ కు మాత్రం సాలిడ్ హిట్ దక్కడం లేదు. దాంతో ఇటీవల బాలీవుడ్ కు వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్దమయ్యాడు శ్రీనివాస్. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్లను వెతుకుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా  దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ను సంప్రదించారని గుసగుసలు వినిపించాయి. ఓ వైపు హిందీలో సినిమాలు చేస్తూనే.. మరో వైపు తెలుగులోను లైన్ లో పెట్టనున్నాడు ఈ యంగ్ హీరో. ఇటీవల ధనుష్ నటించిన ‘కర్ణన్’ ను రీమేక్  చేయనున్నాడట. ఇటీవల థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, కోలీవుడ్లో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడట. అయితే కర్ణన్ సినిమా ను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తుంది.

‘కొత్త బంగారులోకం’ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే శ్రీకాంత్ అడ్డాల భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత చేసిన రెండు సినిమాలు ఫరవాలేదు అనిపించాయి. ఇక మహేశ్ బాబుతో చేసిన ‘బ్రహ్మోత్సవం’ మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇటీవల వెంకటేశ్ హీరోగా ‘నారప్ప’ సినిమాను రూపొందించాడు శ్రీకాంత్. తమిళంలో ధనుశ్ చేసిన ‘అసురన్’ సినిమాకి ఇది రీమేక్. ఇటీవలే శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా షూటింగును పూర్తిచేశాడు. ఇప్పుడు కర్ణన్ సినిమా రీమేక్ కూడా శ్రీకాంత్ అడ్డాల చేతికి వెళ్లినట్టు తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Priyadarshi Pulikonda: మరో విభిన్న కథతో రానున్న ప్రియదర్శి.. ఆకట్టుకుంటున్న పోస్టర్

Ranveer Singh: డైలమాలో బాలీవుడ్ హీరో.. శంకర్ తో సినిమాపై క్లారిటీ తీసుకోనున్న రణ్ వీర్ సింగ్..