Mathu Vadalara 2 Review: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

| Edited By: Rajeev Rayala

Sep 13, 2024 | 1:09 PM

ఐదేళ్ళ కింద మత్తు వదలరా సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యాడు కీరవాణి కొడుకు శ్రీ సింహా. ఆ తర్వాత మూడు నాలుగు సినిమాలు చేసినా వర్కవుట్ అవ్వలేదు. ఇన్నాళ్ళకు మళ్లీ ఆ సినిమా సీక్వెల్‌తోనే వచ్చేసాడు సింహా. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్ధుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సత్య కీలక పాత్రలో నటించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది..? పార్ట్ 1 మాదిరే మత్తు ఎక్కించిందా లేదా..?

Mathu Vadalara 2 Review: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
Mathu Vadalara 2
Follow us on

మూవీ రివ్యూ: మత్తు వదలరా 2

నటీనటులు: శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్ధుల్లా, అజయ్, రోహిణి, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు

ఎడిటర్: కార్తిక శ్రీనివాస్

సినిమాటోగ్రఫర్: సురేష్ సరంగం

సంగీతం: కాలభైరవ

నిర్మాత: చిరంజీవి, హేమలత

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: రితేష్ రానా

ఐదేళ్ళ కింద మత్తు వదలరా సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యాడు కీరవాణి కొడుకు శ్రీ సింహా. ఆ తర్వాత మూడు నాలుగు సినిమాలు చేసినా వర్కవుట్ అవ్వలేదు. ఇన్నాళ్ళకు మళ్లీ ఆ సినిమా సీక్వెల్‌తోనే వచ్చేసాడు సింహా. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్ధుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సత్య కీలక పాత్రలో నటించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది..? పార్ట్ 1 మాదిరే మత్తు ఎక్కించిందా లేదా..?

కథ:

బాబు మోహన్ (శ్రీ సింహా), యేసుదాస్ (సత్య) ఇద్దరూ HE టీంతో స్పెషల్ ఏజెంట్స్‌గా పని చేస్తుంటారు. హై ఎమర్జెన్సీ టీంకు హెడ్ దీప (రోహిణి). అదే ఏజెన్సీలో నిధి (ఫరియా అబ్ధుల్లా) కూడా పని చేస్తుంటుంది. కిడ్నాపర్స్, మర్డరర్స్ ఇలాంటి వాళ్ళ మధ్య సాగిపోతుంటుంది యేసు, బాబు జీవితం. ఇలాంటి సమయంలో రియా అనే అమ్మాయి మిస్ అయిందని.. దామిని (ఝాన్సీ) హి టీంను అప్రోచ్ అవుతుంది. ఆమెను కాపాడతామని తమ టీంకు తెలియకుండా డీల్ మాట్లాడుకుంటారు యేసు, బాబు. కానీ రియా అనుకోని పరిస్థితుల్లో చనిపోతుంది.. అక్కడ్నుంచి ఇద్దరి జీవితాలు మలుపు తిరుగుతాయి. అదే సమయంలో ఆకాశ్ (అజయ్), క్రేజీ హీరో యువ (వెన్నెల కిషోర్) కూడా బాబు, యేసు జీవితాల్లోకి వస్తారు. అప్పట్నుంచి వాళ్ళ లైఫ్ అంతా గందరగోళంగా మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది..? అసలు రియాను ఎవరు చంపారు..? అనేది అసలు కథ..

కథనం:

బ్రాండ్ అన్నిసార్లు వర్కవుట్ అవ్వదు కానీ కొన్నిసార్లు అవుతుంది.. మత్తు వదలరా 2కు ఫస్ట్ పార్ట్ చాలా ప్లస్. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్. సరికొత్త స్క్రీన్ ప్లేతో ఆడియన్స్‌ను ఆ మత్తులోనే ముంచేసాడు దర్శకుడు రితేష్ రానా. సెకండ్ పార్ట్ కూడా అరే ఇదేదో బాగానే ఉందే అనిపిస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ అన్నట్లు.. ఫస్ట్ పార్ట్ సూపర్. పార్ట్ 2 దానికి మించి ఎక్స్‌పెక్ట్ చేస్తాం కానీ అంతగా అనిపించదు.. కానీ నిరాశ పరచదు.. ఫస్టాఫ్ అంతా నాన్ స్టాప్ కామెడీతో పిచ్చెక్కించాడు సత్య. మనోడు కనిపించిన ప్రతీ సీన్ పేలింది.. వన్ మ్యాన్ షో అంతే. సీన్‌లో ఏం లేదే అనే చోట కూడా సత్య తన పంచులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వించాడు. హై ఎంటర్‌టైనింగ్ ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ కాస్త స్లో అయింది. వెన్నెల కిషోర్ నుంచి చాలా కామెడీ ఊహిస్తాం కానీ నిరాశ తప్పదు. అంత హైప్ ఇచ్చిన కారెక్టర్‌ను సెకండాఫ్‌లో నీరు గార్చేసారు. చివరి అరగంట ట్విస్టులు బాగున్నాయి.. స్క్రీన్ ప్లే అదిరిపోయింది. పార్ట్ 1ను లింక్ చేస్తూ రాసుకున్న సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. సినిమాలో అన్నీ ఒకఎత్తు అయితే.. ఓరి నా కొడకా ఎపిసోడ్ మరో మత్తు. తెలుగులోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే ది బెస్ట్ సీరియల్ రోస్టింగ్ ఇదేనేమో..? లాజిక్స్ పక్కనబెట్టి చూస్తే మత్తు వదలరా 2 బాగానే నవ్విస్తుంది. ఇందులోనూ చిరు, బాలయ్య రిఫరెన్సులు వాడాడు దర్శకుడు రితేష్ రానా. క్లైమాక్స్‌లో సత్యపై షూట్ చేసిన చిరంజీవి పాట కడుపులు చెక్కలు చేస్తుంది. ఎక్కడికక్కడ ట్విస్టులు కథపై ఆసక్తి పెంచేస్తుంటాయి. కథ రొటీన్‌గానే ఉన్నా.. ఈ విషయంలో జాగ్రత్త పడ్డాడు దర్శకుడు రితేష్.

నటీనటులు:

శ్రీ సింహా మరోసారి అదరగొట్టాడు. బాబు పాత్రలో జీవించాడు.. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ఇక కమెడియన్ సత్య ఈ సినిమాకు ప్రాణం. మనోడు ఇరక్కొట్టాడు.. ఇంకా చెప్పాలంటే జస్ట్ చంపేసాడంతే. సత్య కనిపిస్తే స్క్రీన్ అరుపులు.. అలా ఉన్నాయి ఈయన పంచులు. సింగిల్ మ్యాన్ షో చేసి సినిమాను ఒంటిచేత్తో నిలబెట్టాడు సత్య. ఫరియా అబ్దుల్లా బాగుంది.. స్క్రీన్ ప్రజెన్స్, అలాగే నటన కూడా. సునీల్, వెన్నెల కిషోర్ లాంటి సీనియర్ కమెడియన్స్‌ను పెట్టుకుని కూడా ఎందుకో మరి రితేష్ వాళ్లపై ఎక్కువగా ఫోకస్ చేయలేదు. సునీల్‌ను అయితే మరీనూ.. ఈయన కారెక్టర్ మరింత హిలేరియస్‌గా చేయొచ్చేమో అనిపించినా.. అక్కడి వరకే వాడుకున్నట్లు అనిపిస్తుంది.

టెక్నికల్ టీం:

మత్తు వదలరా 2 సినిమాకు కాల భైరవ సంగీతం ప్లస్. ముఖ్యంగా ఊ.. అంటూ వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్. సురేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా ఓకే. ఫస్టాఫ్ అయితే రేసుగుర్రంలా పరిగెడుతుంది కానీ సెకండాఫ్ అక్కడక్కడా బ్రేకులు పడ్డాయి. దర్శకుడు రితేష్ రానా మరోసారి తన మార్క్ చూపించాడు. రొటీన్ సినిమాలకు భిన్నంగా సాగుతుంది మత్తు వదలరా 2. కామెడీ కూడా చాలా బాగా వర్కవుట్ అయింది. చిరంజీవి రిఫరెన్సులు వాడుకున్న తీరు బాగుంది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా మత్తు వదలరా 2.. పార్ట్ 1 అంత కిక్ ఇవ్వదు కానీ నవ్విస్తుంది..