
గత శుక్రవారం (ఫిబ్రవరి 06) దాదాపు అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. అందులో దాదాపు అన్నీ చిన్న సినిమాలే.అయితే అందులో ఒక సినిమా మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే శ్రీ చిదంబరంగారు. మెల్లకన్ను కారణంగా ఓ యువకుడు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నడన్నది ఈ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించారు. వినయ్ రత్నం తెరకెక్కించిన ఈ డిఫరెంట్ మూవీలో దాదాపు అందరూ కొత్త వాళ్లే నటించారు. అయితేనేం తమ సహజ నటనతో ఆకట్టుకున్నారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట, గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరం, శంకర్ రావు తదితరులు శ్రీ చిదంబరంగారు మూవీలో కీలక పాత్రలు పోషించారు. అయిదే ఇదే సినిమాలో శశి అనే ఒక ఛైల్డ్ ఆర్టిస్ట్ కూడా నటించాడు. సినిమాలో ఈ పిల్లాడి నటన కూడా బాగా హైలెట్ గా నిలిచిందంటున్నారు ఆడియెన్స్. ఇక డైరెక్టర్ కూడా ఈ కుర్రాడి యాక్టింగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇతని యాక్టింగ్ కోసమైనా శ్రీ చిదంబరం గారు సినిమాను చూడాలని ఆడియెన్స్ ను కోరుతున్నాడు.
అయితే ఇప్పుడు తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన శశి ఆరేళ్ల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడట. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడట. అయితే అదే సమయంలో నందమూరి బాలకృష్ణ ఆ ఆస్పత్రికి వచ్చారట. పిల్లాడితో చాలా ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారట. అదే సమయంలో ‘నువ్వు మంచి యాక్టర్ అవుతావ్’ అని శశికిరణ్ ను ఆశీర్వదించాడట. ఇప్పుడు అదే మాట నిజమైందంటున్నాడు శశి.
శ్రీ చిదంబరం గారు మూవీ సక్సెస్ మూవీలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు శశి. ‘బాలకృష్ణ గారు…ఆ రోజు నాతో చెప్పిన మాట.. ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు’ అని ఈ కుర్రాడు ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి .
/h3>
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి