ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో శ్రీలీల కూడా ఒకరు. కేవలం అందం, అభినయం పరంగానే కాకుండా డ్యాన్సులతో దుమ్మురేపుతోందీ అందాల తార. గతేడాది భగవంత్ కేసరి, ఆదికేశవ, స్కంద సినిమాలతో మెప్పించిన శ్రీలీల.. ఈ ఏడాది మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో అలరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక అరడజనుకు పైగా సినిమాలున్నాయి. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ రాబిన్ హుడ్, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఒక బాలీవుడ్ సినిమాలోనూ శ్రీలీల నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. శ్రీలీల కు సామాజిక దృక్పథం ఎక్కువ. పేద పిల్లలు, అనాథలకు, ఫిజికల్, మెంటల్లీ డిజుబుల్ పర్సన్స్‌కు తనకు వీలైనంత వరకు సాయం చేస్తుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకుంది శ్రీలీల. స్టార్ హీరోయిన్ అయినా ఒక సాధారణ అమ్మయిలా రోడ్ సైడ్ టీ స్టాల్ లో టీ తాగింది. అంతేకాదు ఆ టీ షాప్ నిర్వహిస్తోన్న మహిళ, చుట్టు పక్కల ఉన్న వారితో అప్యాయంగా మాట్లాడింది. వారితో సరదగా ఫొటోలు కూడా దిగింది.
తాజాగా ఓ సినిమా షూటింగ్ కోసం అరకు వెళ్లింది శ్రీలీల. అయితే షూటింగ్ లో కాస్త విరామం దొరకడంతో మధ్యలో తన తల్లితో కలిసి రోడ్ సైడ్ ఉన్న ఒక చిన్న టీ స్టాల్ కు వెళ్లి సందడి చేసింది. శ్రీలీలను గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. హీరోయిన్ తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. శ్రీలీల కూడా అడిగిన వారందరికీ కాదనకుండా సెల్ఫీలు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#TFNExclusive: The charming beauty @sreeleela14 snapped along with her family as she enjoys a tea break at Araku!!☕😍#Sreeleela #UstaadBhagatSingh #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/zNFABqBY3P
— Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2024
Happy Birthday @sreeleela14 aka ‘Neera Vasudev’ from the adventurous world of #Robinhood ❤️🔥
Have a rocking year ahead leela 🤗
In cinemas from December 20th, 2024.@actor_nithiin @VenkyKudumula @gvprakash @MythriOfficial pic.twitter.com/3pHbwx6A6b
— nithiin (@actor_nithiin) June 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.