పవన్ సినిమాకు వెళ్లాలన్న కోరిక తీరింది.. హరిహర వీరమల్లు థియేటర్ వద్ద ప్రత్యేక ప్రతిభావంతుల సందడి.

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జులై 24న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

పవన్ సినిమాకు వెళ్లాలన్న కోరిక తీరింది.. హరిహర వీరమల్లు థియేటర్ వద్ద ప్రత్యేక ప్రతిభావంతుల సందడి.
Pawan Kalyan

Edited By: Rajeev Rayala

Updated on: Jul 30, 2025 | 8:11 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా చూడాలన్న ప్రత్యేక ప్రతిభావంతుల కోరికను జనసేన తీర్చింది. తిరుపతిలోని నవజీవన్ హోమ్ లో ఉంటున్న అంధ విద్యార్థులు హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శించే థియేటర్ కు చేరుకొని ఆ సినిమా కథను పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ను వినాలనుకున్నారుసోషల్ మీడియా వేదికగా సినిమా కు వెళ్లాలన్న కోరికను తెలిపిన విద్యార్థులు ఎట్టకేలకు ఆశపడ్డ కోరికను తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు హరిహర వీరమల్లు సినిమా చూడాలన్న ప్రత్యేక ప్రతిభావంతులను థియేటర్ కు తీసుకెళ్లిన తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ అన్ని ఏర్పాట్లు చేశారు. హరిహర వీరమల్లు సినిమా ప్రత్యేక షో వేయించారు. నవజీవన్ అంధుల పాఠశాల కు చెందిన 145 విద్యార్థులను తీసుకెళ్లారు. వీరమల్లు సినిమా కథ, మాటలు, పాటలు విని ఎంజాయ్ చేసిన ప్రత్యేక ప్రతిభావంతులతో కలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్
స్పెషల్ షో చూసారు. 3 బస్సుల్లో హరిహర వీరమల్లు సినిమా థియేటర్ కు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు థియేటర్ వద్ద కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో కలిసి సంబరాలు జరుపుకున్నారు.