గాన గంధర్వుడు, లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం.. వేల పాటలతో శ్రోతలను అలరించారు. తన గానంతో తెలుగు, హీందీ, తమిళ్ భాషలలో కొన్ని వేల పాటలను ఆలపించి.. ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. సంగీత ప్రపంచంలో రారాజుగా.. తెలుగు సినీ పరిశ్రమలో వెలుగు వెలిగిన దృవతార ఎస్పీ బాలసుబ్రమణ్యం… ఈ ప్రపంచాన్ని వదిలి సంవత్సర కాలం పూర్తైంది. ప్రేమ, కోపం, అలక, అమాయకత్వం.. ఇలా అన్ని ఎమోషన్స్‌ను బాలు తన పాటలో అవలీలగా చూపిస్తాడు. యావత్ ప్రపంచాన్ని పట్టి పిడిస్తున్న కరోనా మాహమ్మరికి బలైనవారిలో బాలు ఒకరు. ఆకస్మాత్తుగా సినీ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయారు. అయినా ఇప్పటికీ బాలు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఎస్పీ బాలు కొత్త పాడిన పాట ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సూపర్ స్టార్ రజినీ కాంత్, ఎస్పీ బాలు కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. తాజాగా వీరి కాంబో నుంచి మరో సాంగ్ రాబోతుంది. రజినీ కాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. శౌర్యం, వేదాళం, విశ్వాసం వంటి సినిమాలను తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకలు ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందులో రజినీ ఇంట్రడక్షన్ పాటను అక్టోబర్ 4న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. చాలా కాలం తర్వాత.. రజీని ఇంట్రక్షన్ సాంగ్.. అది కూడా ఎస్పీ బాలు పాడడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Also Read: Pushpa Movie: రూమర్స్‌కు చెక్ పెట్టిన మేకర్స్.. పుష్పరాజ్ వచ్చేది అప్పుడే..