AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ స్టార్ హీరోను ప్రాణంగా ప్రేమించింది.. చనిపోతూ పేద విద్యార్థులకు కోట్ల ఆస్తులు దానం చేసిన హీరోయిన్..

సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్లను దాటాల్సి ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకోవడం అంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు నటిగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఓ స్టార్ హీరోను ప్రాణంగా ప్రేమించింది. కానీ భర్త చేతిలో వేధింపులకు గురైంది. చివరకు చనిపోతూ తన కోట్ల ఆస్తులను దానం చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood: ఆ స్టార్ హీరోను ప్రాణంగా ప్రేమించింది.. చనిపోతూ పేద విద్యార్థులకు కోట్ల ఆస్తులు దానం చేసిన హీరోయిన్..
Actress
Rajitha Chanti
|

Updated on: Apr 01, 2025 | 12:39 PM

Share

సినీరంగుల ప్రపంచంలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో వెండితెరపై ప్రేక్షకులను అలరించింది. అతి తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్ని తారుమారు చేశాయి. స్టార్ హీరోను ప్రాణంగా ప్రేమించింది. చివరకు అతడిని కాకుండా మరొకరిని పెళ్లిచేసుకుంది. భర్త చేతిలో మోసపోయింది. చివరకు క్యాన్సర్ తో పోరాడుతూ తన కోట్ల ఆస్తులను పేద విద్యార్థుల చదువుల కోసం దానం చేసి మరణించింది. ఆమె జీవితం.. సినీప్రయాణం కన్నీటి కథ. ఆమె మరెవరో కాదు.. శ్రీవిద్య. ప్రముఖ హాస్యనటుడు కృష్ణమూర్తి, కర్ణాటక గాయని ఎం.ఎల్. వసంత కుమారి కుమార్తె శ్రీవిద్య.

శ్రీవిద్య జన్మించిన ఒక సంవత్సరం తర్వాత, ఆమె తండ్రి కృష్ణమూర్తి ఒక ప్రమాదం కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె తల్లి ఎంఎల్ వసంతకుమారి కుటుంబ బాధ్యతలన్నీ తనపై వేసుకుంది. 14 ఏళ్ల వయసులోనే శ్రీవిద్య కుటుంబం కోసం సినీరంగంలోకి అడుగుపెట్టింది. శ్రీవిద్య నటుడు తిలగం శివాజీ గణేషన్ నటించిన ‘తిరువరుట్చెల్వన్’ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. దర్శకుడు దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో ఆమెకు అనేక సినిమా అవకాశాలు వచ్చాయి.

Srividya

Srividya

అప్పట్లో శ్రీవిద్య స్టార్ హీరో కమల్ హాసన్‏ను ప్రాణంగా ప్రేమించిందట. వీరిద్దరి కలిసి అనేక చిత్రాలలో నటించారు. అయితే వీరిద్దరి వివాహనికి శ్రీవిద్య తల్లి అంగీకరించకపోవడంతో ఇద్దరూ తమ సంబంధాన్ని తెంచుకున్నారు. శ్రీవిద్య 1978లో మలయాళ దర్శకుడు జార్జ్ థామస్‌ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఆమె భర్త కోరిక మేరకు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కానీ అప్పుడే ఆమె జీవితం తారుమారైంది. ఆమె ఆస్తులను తన భర్త ఆక్రమించుకోవడం.. వేధింపులకు గురిచేయడంతో వీరిద్దరు 1980లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది శ్రీవిద్య. 2003 లో క్యాన్సర్‌తో బాధపడుతున్న శ్రీవిద్య తనకున్న వందల కోట్ల ఆస్తిని పేద విద్యార్థుల చదువుల కోసం దానం చేసింది. నటుడు గణేష్ సహాయంతో, శ్రీవిద్య ఒక ఫౌండేషన్‌ను స్థాపించి, అర్హులైన విద్యార్థులకు స్కాలర్ షిప్ సాయం చేసింది. 2006లో 53 సంవత్సరాల వయసులో మరణించింది.

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..