Sobhita Dhulipala: నాకు ఆ హీరో సినిమా అంటే చాలా ఇష్టం.. ఊహించని పేరు చెప్పిన శోభిత

టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని కోడలు శోభిత దూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేసిన ఆమె ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల తార.

Sobhita Dhulipala: నాకు ఆ హీరో సినిమా అంటే చాలా ఇష్టం.. ఊహించని పేరు చెప్పిన శోభిత
Sobhita Dhulipala

Updated on: Dec 23, 2025 | 11:10 AM

అందాల భామ శోభితా ధూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా సినిమాల్లో నటించిన ఈ చిన్నది.. అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. వివాహం తర్వాత కూడా శోభిత సినిమాలు చేస్తున్నారు. అయితే శోభిత గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మరోసారి వైరల్ గా మారాయి. గతంలో ఆమె మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో రాణించడం చాలా ఇష్టం.. ఇక్కడ చాలా కష్టం ఉంటుందని, అయినప్పటికీ తన స్వయం కృషితో నటిగా రాణిస్తున్నా అని తెలిపారు శోభిత.

అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు.. దోచెయ్ సినిమాలో చైతూ చెల్లెలు గుర్తుందా.?

గతంలో ఓ ఇంటర్వ్యూలో శోభితా ధూళిపాళ్ల, తన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఎటువంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన శోభిత, తాను సినీ రంగ ప్రవేశం చేయాలనుకున్నప్పుడు తన తల్లిదండ్రులు ఆందోళన చెందారని తెలిపారు.సినిమాల్లోకి వెళ్తాను అంటే ముందు మా పేరేంట్స్ వద్దన్నారని తెలిపింది. తన తండ్రి మర్చంట్ నేవీలో రిటైర్డ్ అధికారి కాగా, తల్లి రిటైర్డ్ టీచర్ అని, సినిమా ఇండస్ట్రీకి తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ రంగంలో ఎవరూ తెలియకపోవడంతో, చిన్న వయసులోనే కష్టమైన పోటీ ఎదుర్కోవాల్సి వచ్చిందని శోభిత చెప్పుకొచ్చారు. అలాగే సాంస్కృతిక విషయాలపై తనకు ఎంతో ఆసక్తి ఉందని, చదవడం, నాట్యం చేయడం తనకు ఇష్టమని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి

మేము పనికిరామా.. డ్రైవర్, పనిమనిషిల పాత్రలే ఇస్తారా.. సీరియల్ నటుడి ఆవేదన

సంగీతం కూడా నేర్చుకోవాలని ఉందని చెప్పారు. 2013లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత, వైజాగ్ ప్రజలు, మీడియా తన పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపారని శోభిత అన్నారు. అయితే అప్పుడు తనకు కేవలం 19 లేదా 20 ఏళ్లు మాత్రమే కావడంతో, వచ్చిన పేరును ఎలా ఉపయోగించుకోవాలో సరిగా తెలియదని, డబ్బు సంపాదించాలనో, ఫేమ్ కావాలనో తాను ఈ రంగంలోకి రాలేదని ఆమె తెలిపారు. మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు అడుగులు వేయడం తన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని, చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువగా చూడకపోయినా, పుస్తకాలు చదవడానికి ఇంట్రెస్ట్ చుపించానని తెలిపారు. ఇక తనకు ఇష్టమైన సినిమాల్లో శేఖర్ కమ్ముల ఆనంద్ ఒకటి అని అన్నారు. అలాగే సినీ పరిశ్రమలో విజయం సాధించడానికి పడే కృషి, పట్టుదల గురించి శోభితా ధూళిపాళ్ల తన అనుభవాలను పంచుకున్నారు.

చిన్న కథ కాదురా ఇది..! ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.