Sivakarthikeyan’s Don: శివకార్తికేయన్ డాన్ సినిమాకు బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్

|

May 14, 2022 | 8:25 PM

తమిళ్ హీరో శివ కార్తికేయన్ కు తెలుగులోకూడా మంచి క్రేజ్ ఉంది. రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు శివ కార్తికేయన్. రెమో సినిమా తెలుగులోనూ మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Sivakarthikeyans Don:  శివకార్తికేయన్  డాన్ సినిమాకు బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్
Don
Follow us on

తమిళ్ హీరో శివ కార్తికేయన్(Siva karthikeyan) కు తెలుగులోకూడా మంచి క్రేజ్ ఉంది. రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు శివ కార్తికేయన్. రెమో సినిమా తెలుగులోనూ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత శివ కార్తికేయన్ నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. చివరగా శివ కార్తికేయన్ నటించిన వరుణ్ డాక్టర్ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో.  మే 13 విడుదలైన శివ కార్తికేయన్ ‘డాన్'(Don) చిత్రం బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ తో సక్సెస్ జర్నీని కొనసాగించింది. శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన డాన్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

చిత్రానికి ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ స్పందన రావడంతో నిర్మాత, లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ సుభాస్కరన్, హీరో-నిర్మాత శివకార్తికేయన్‌లు ఆనందం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ లోకి రప్పించడానికి వేసవి సరైన సమయమని భావించిన నిర్మాతలు, ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నిర్మాతలు భావించినట్లే ఈ చిత్రానికి మార్నింగ్ షో నుంచే భారీగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ కనిపించింది. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘డాన్’ చిత్రం ద్వారా శిబి చక్రవర్తి దర్శకుడిగా పరిచయమయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Keerthy Suresh: కళావతి అందాలకు కల్లోలం అవుతున్న కుర్రకారు

Rukshar Dhillon: పాలరాతి శిల్పం లా మెరిసిపోతున్న రుక్సర్‌ ధిల్లాన్‌.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Bhanu Shree: భాను శ్రీ కొంటె చూపాలకు కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే