తెలుగు పాట ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన వెండితెర సిరివెన్నెల చీకటైంది. సినీ పరిశ్రమలో ఎన్నో వేల పాటలను రచించిన సిరివెన్నెల సాహిత్యాన్ని ఒంటరి చేసి అందనంతా దూరం వెళ్లిపోయారు. దర్శకుడు విశ్వానాథ్ తెరకెక్కించిన సిరివెన్నెల సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సిరివెన్నెల.. దశాబ్దాలుగా ఎన్నో వేల పాటలను రచించారు. విధాత తలపున ప్రభవించినది అంటూ సిరివెన్నెల రాసిన పాట ఇప్పటికీ ప్రేక్షకులను గుండెల్లో నిలిచిపోయింది. బూడిదిచ్చే శంకరుడిని ఏమి అడిగేది అంటూ సిరివెన్నెల పాట ఇప్పటికీ శ్రోతల మనసును తాకుతుంది.
దర్శకుడు విశ్వానాథ్ తెరకెక్కించిన సిరివెన్నెల సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు సీతారామశాస్త్రి. మొదటి సినిమా పేరునే ఆయన ఇంటిపేరుగా మార్చుకున్నారు. సిరివెన్నెల సినిమాలోని ప్రతి పాట ఓ ఆణిముత్యమే.
మెగాస్టార్ చిరంజీవి.. విజయశాంత జంటగా నటించిన స్వయం కృషి సినిమాలోని పారాహుషార్ పాట ఇప్పటికీ శ్రోతల మనసును హత్తుకుంటుంది.
సిరివెన్నెలకు నంది అవార్డులు అందించిన పాటలు..
☛ సిరివెన్నెల (1986) … విధాత తలపున ప్రాభవించినది..
☛ శృతిలయలు (1987) … తెలవారదేమో స్వామీ..
☛ స్వర్ణకమలం (1988) అందెల రవమిది పదములుగా..
☛ గాయం (1993) సురాజ్యమవలేని స్వరాజ్యంమెందుకని..
☛ శుభలగ్నం (1994) చిలుక ఏ తోడు లేక…
☛ శ్రీకారం (1996) మనసు కాస్త కలత పడితే..
☛ సింధూరం (1998) అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే..
☛ ప్రేమకథ (1999) దేవుడు కరుణిస్తాడని…
☛ చక్రం (2005) జగమంత కుటుంబం నాది…
☛ గమ్యం (2008) ఎంతవరకూ ఎందుకొరకు..
☛ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) మరీ అంతగా..
✤ మెగాస్టార్ చిరంజీవి నటించిన రుద్రవీణ (1988) సినిమాలోని . నమ్మకు నమ్మకు ఈ రేయినీ పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు సిరివెన్నెల.
✤ ఫిలింఫేర్ అవార్డులు..
☛ నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) ఘల్ ఘల్ ఆకాశం తాకేలా..
☛ గాయం (2008) ఎంతవరకు..
☛ మహాత్మ (2009) ఇందిరమ్మ ఇంటి పేరు..
☛ కంచె (2015) రా ముందడుగేద్దాం..