Singer Sunitha: దర్శకుడు అలా అనేసరికి చాలా కోపం వచ్చింది.. ఆసక్తికర విషయం చెప్పిన అందాల సింగర్..

మధురమైన గొంతుతోనే కాదు చూడచక్కని రూపంతోను ఆకట్టుకుంటారు సింగర్ సునీత. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ శ్రోతలను అలరించారు సునీత.

Singer Sunitha:  దర్శకుడు అలా అనేసరికి చాలా కోపం వచ్చింది.. ఆసక్తికర విషయం చెప్పిన అందాల సింగర్..

Updated on: May 05, 2021 | 11:39 AM

Singer Sunitha: మధురమైన గొంతుతోనే కాదు చూడచక్కని రూపంతోనూ ఆకట్టుకుంటారు సింగర్ సునీత. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ శ్రోతలను అలరించారు సునీత. ఇటీవలే రెండో వివాహం చేసుకొని సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు ఈ గానకోకిల. ప్లేబ్యాక్ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా టూ షేడ్స్‌ ఆఫ్‌ కెరీర్స్‌నీ పార్లల్‌గా ఫినిష్ చేస్తూ.. స్టార్ స్టేటస్‌ని దక్కించుకోవడం కేవలం సునీతకు మాత్రమే చెల్లింది. వందల పాటలు పాడి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమెకు.. టాలీవుడ్‌ ఏ సింగర్‌ లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అద్భుతంగా పాడడమే కాదు… అందంగా నవ్వడం… కళ్లతో భావాల్ని పలికించడం ఇవన్నీ సునీత ఉపద్రష్టకున్న వెరీ యూనిక్ స్పెషాలిటీస్. ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా ఈ  అందాల గాయని ఓ ఫన్నీ విషయాన్నీ అభిమానులతో  షేర్ చేసుకున్నారు.  తను ఓ సినిమాకు డబ్బంగ్‌ చెబుతున్న సయమంలో ఆ డైరెక్టర్‌ తనతో వ్యవహరించిన తీరు గురించి చెప్పుకొచ్చింది. సునీత మాట్లాడుతూ..‘మొదట నేను డబ్బింగ్‌ స్టూడియోలో రాగానే  ఆ మూవీ దర్శకుడు హాలో మేడమ్‌ అంటూ నన్ను పలకరిస్తూనే నా అభిమానిని అంటూ పరిచయం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత కాసేపటికి ఆయన నన్ను సునీత అని పిలవడం పేరుతో పిలవడం మొదలు పెట్టారు. అలా కొంత సమయం అయ్యాక మధ్యలో అరేయ్‌, కన్నా, బుజ్జి అని పిలవడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది.  అది నాకు కాస్తా చిరాగ్గా అనిపించేది. ఇక నా అదృష్టం ఏంటంటే దాని తర్వాత ఆయన్ను కలిసే అవకాశం రాలేదు అంటూచెప్పుకొచ్చింది . అప్పుడు అది కోపం తెప్పించిన ఇప్పుడు దాన్ని తలచుకుంటే నవ్వొస్తుంది అన్నారు సునీత.

మరిన్ని ఇక్కడ చదవండి :

Music director Thaman: చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా తమన్.. రెమ్యునరేషన్ కూడా పెంచేసాడంటున్నారే ..

Sonu Sood : కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు రియల్ హీరో సోనూసూద్ విజ్ఞప్తి… మద్దతు తెలిపిన గ్లోబల్ బ్యూటీ..