AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Star: ఇక్కడ డిజాస్టర్ అయిన పవన్ సినిమా బాలీవుడ్ కు పయనమైంది.. అక్కడేమవుతుందో మరి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూడో సినిమాగా చిత్రం అజ్ఞాతవాసి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసుదగ్గర్ బోల్తా కొట్టింది.

Power Star: ఇక్కడ డిజాస్టర్ అయిన పవన్ సినిమా బాలీవుడ్ కు పయనమైంది.. అక్కడేమవుతుందో మరి..
Rajeev Rayala
|

Updated on: May 05, 2021 | 12:08 PM

Share

Power Star : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూడో సినిమాగా చిత్రం అజ్ఞాతవాసి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసుదగ్గర్ బోల్తా కొట్టింది. అప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ సినిమాలు రావడంతో అజ్ఞాత వాసి సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఫ్యాన్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ‘లార్గో వించ్’ అనే ఫ్రెంచ్ మూవీని కాపీ చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని తీసాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. లార్గో వించ్ దర్శకుడు జెరోమ్ సల్లే సైతం ‘అజ్ఞాతవాసి’ తన సినిమాకు కాపీ అని ట్వీట్ చేసాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా అను ఇమ్మాన్యుయేల్ , కీర్తిసురేష్ హీరోయిన్లు గా నటించారు. ప్రముఖ తమిళ్ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇవేమి ఈ సినిమాను గట్టెకించలేక పోయాయి. ఈ సినిమా తర్వాత పవన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లోకి రీమేక్ అవ్వబోతుంది.

‘శక్తి’ ‘ఊసరవెల్లి’ ‘తుపాకీ’ ‘సికిందర్’ చిత్రాలలో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ ఈ ప్రాజెక్ట్ లో హీరోగా నటిస్తున్నారు. ‘రుస్తుం’ ఫేమ్ టిను సురేష్ దేశాయ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ  ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా బాలీవుడ్ ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sonu Sood : కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు రియల్ హీరో సోనూసూద్ విజ్ఞప్తి… మద్దతు తెలిపిన గ్లోబల్ బ్యూటీ..

kangana Ranaut: త‌న ఖాతాను తొల‌గించ‌డంపై స్పందించిన కంగ‌న‌.. ట్విట్ట‌ర్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన బాలీవుడ్ క్వీన్‌..

Lucky Ali: అలీ మరణించలేదు.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు.. పుకార్లు నమ్మకండి

Follow Us
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..