Singer Sunitha: తన భర్త గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్‏కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన సింగర్ సునీత..

సింగర్ సునీత (Singer Sunitha) ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గాత్రంతో వందల పాటలు పాడి

Singer Sunitha: తన భర్త గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్‏కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన సింగర్ సునీత..
Singer Sunitha

Updated on: Feb 05, 2022 | 9:01 AM

సింగర్ సునీత (Singer Sunitha) ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గాత్రంతో వందల పాటలు పాడి శ్రోతలను ఆకట్టుకుంది. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్‏గానూ సునీత చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఇటీవల కాలంలో సునీత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటున్నారో తెలిసిందే.

ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ.. నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో తన గురించి గానీ.. తన కుటుంబసభ్యుల పై వచ్చే నెగిటివ్ కామెంట్స్ పట్ల సున్నితంగా వ్యవహరిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ కామెంట్స్ శ్రుతిమించితే వారికి తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటరిస్తుంది. తాజాగా తన భర్త రామ్ వీరపనేని గురించి ఓ నెటిజన్ చేసిన కామెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది సునీత.

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలోని సమతా విగ్రహం వద్ద సునీత తన భర్తతో కలిసి వెళ్లారు. సాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటూ తన భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇక వీరి ఫోటోపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందించారు. అందులో ఓ నెటిజన్ సునీత భర్తపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు.

Singer

కాకి ముక్కుకు దొండపండు. సునీతకు ముసలిరామ్ మొగుడు.. అందం ఆమె సొంతం.. ధనము ఆయన సొంతం. గానం ఈవిడది, దర్జా అతనిది అంటూ ఇష్టానుసారంగా వాగేశాడు. ఈ కామెంట్ చూసిన సునీత అతనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. నోటి దూల నీది.. నీ భారం భూమిది అంటూ కౌంటర్ వేశారు. సింగర్ సునీత ఇచ్చిన రిప్లైకు నెటిజన్స్ మద్దతు తెలుపుతున్నారు.

Also Read: Mahesh Babu: బుర్జ్ ఖ‌లీఫాపై మహేష్ స్టంట్ .. ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ న్యూ యాడ్..

Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ పాటలు పాడుతున్న యంగ్ హీరో.. శర్వా సినిమా నుంచి సాంగ్..

Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్‌ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

Siri-Srihan: ఎట్టకేలకు రూమర్స్‏కు ఫుల్‏స్టాప్ పెట్టిన లవ్ బర్డ్స్.. యాంకర్ రవి ఫ్యామిలీతో సిరి, శ్రీహాన్ సందడి..