Singer Sunitha: ‘నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా’.. సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్..

|

Jun 04, 2023 | 2:57 PM

నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా.. పుట్టినరోజు శుభాకాంక్షలు నేరుగా చెప్పుకునే అదృష్టం లేకుండా చేసిన ఆ భగవంతుడిని ఈరోజు మాత్రం ఎప్పటికీ నిందిస్తూనే ఉంటాను..

Singer Sunitha: నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా.. సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్..
Singer Sunitha, Sp Balu
Follow us on

తెలుగు సినీ పరిశ్రమలో ఆయన గాత్రం ఓ మధురం. సంగీత ప్రపంచంలో ఆయన ఓ గాన గంధర్వుడు. ఎన్నో మధురమైన పాటలు ఆలపించి తనకంటూ ప్రత్యేక పేజిని లిఖించుకున్నారు. దాదాపు పదమూడు భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడి స్వరరాగ రంగా ప్రవాహంలో మునిగి తేలిన లెజెండరీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా సినీ ప్రముఖులు, గాయనీ గాయకులు బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సింగర్ సునీత సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

“నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా.. పుట్టినరోజు శుభాకాంక్షలు నేరుగా చెప్పుకునే అదృష్టం లేకుండా చేసిన ఆ భగవంతుడిని ఈరోజు మాత్రం ఎప్పటికీ నిందిస్తూనే ఉంటాను” అంటూ బాలుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు సునీత..

ఇవి కూడా చదవండి

ఇండస్ట్రీలో తన మధర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేసిన గాయనీ సింగర్ సునీత. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. కేవలం గాయనీగానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. లక్షలాదీ మంది అభిమానులను సొంతం చేసుకున్నారనే. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా.. తన మధరమైన గాత్రంతో సంగీత ప్రియులను మైమరపించింది. తన జీవితంలో కష్టం వచ్చిన ప్రతిసారి తనకు అండగా ఉండి ఎస్పీ బాలు ధైర్యం చెప్పేవారని గతంలో అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు సునీత.

ఎస్పీ బాలును మామయ్య అంటూ అప్యాయంగా పిలుస్తానని చెప్పారు సునీత. తన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి బాలూగారిని పోగొట్టుకోవడం.. ఆ సంఘటన తర్వాత తనకు కన్నీళ్లు రావడం లేదని.. జీవితంలో అంతకు మించి చలించే సంఘటనలు ఇంకా ఏముంటాయని.. ఆయన మరణవార్త తర్వాత అంతగా నన్ను ఏ సంఘటనలు కదిలించడం లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సునీత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.