
కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి), అతని సతీమణి ఆర్తిల విడాకుల వ్యవహారం రోజు రోజుకో మలుపు తిరుగుతోంది. ఫ్యామిలీ కోర్టు వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించగా నటుడు ససేమిరా అన్నాడు. తన భార్యతో విడాకులు కావాల్సిందేనని తెగేసి చెప్పాడు. దీంతో ఆర్తి కూడా విడాకుల భరణంగా నెలకు రూ. 40 లక్షలు ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దీంతో న్యాయ స్థానం తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేసింది. కాగా రవి మోమన్- ఆర్తి దంపతులకు విడిపోయేందుకు ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సెస్ కారణమని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. సింగర్- రవి మోహన్ ప్రేమలో ఉన్నారని అందుకే రవి మోహన్ తన భార్యకు విడాకులు ఇస్తున్నాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగానే రవి మోహన్- ఆర్తిల కుటుంబ వ్యవహారంలో సింగర్ సుచిత్ర తల దూర్చింది. అంతేకాదు ఆర్తి ఒక స్టార్ హీరోతో ఎఫైర్ నడుపుతోంది సంచలన ఆరోపణలు చేసింది. ఆర్తి ఆ హీరోతో ప్రేమలో ఉంది కాబట్టే రవి ఆమె నుంచి విడాకులు కోరుతున్నాడు అంటూ హాట్ బాంబు పేల్చింది. అలాగే కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది. అందులో ఆర్తితో ఒక స్టార్ హీరో క్లోజ్ గా కనిపించాడు. అతను మరెవరో కాదు ధనుష్.
‘ఆర్తి- ధనుష్‌కి ఉన్న సంబంధం గురించి ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులుకు తెలుసు. వారిద్దరి అఫైర్ గురించి తెలిసే రవి మోహన్ ఆమెకు విడాకులు ఇస్తున్నాడు’ అంటూ ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది సుచిత్ర..
అతను, తన తోటి హీరోల భార్యలతో సిగ్గు లేకుండా సెక్స్ చేస్తున్నాడు. తన మైండ్ సెట్‌ని సరిచేయాల్సిన అవసరం ఉంది.. ’ అంటూ
అయితే సింగర్ సుచిత్ర షేర్ చేసిన ఫొటోను ఆరా తీస్తే సంచలన విషయలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఫోటో నిజమే కానీ వారిద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. గతంలో రవి మోహన్ స్వయంగా ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు ఆర్తి-ధనుష్ లది అన్నా చెల్లెళ్ల బంధమని అతనే స్వయంగా ప్రకటించాడు. అయితే ఇప్పుడు అదే ఫొటోను పట్టుకుని సింగర్ సుచిత్ర నీచమైన కామెంట్స్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక నువ్వు మారవా? అంటూ ఆమెపై మండి పడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.