- Telugu News Photo Gallery Cinema photos What were the decisions taken at the meeting with exhibitors at the Film Chamber?
Exhibitors Meeting: ఎగ్జిబిటర్లతో ఫిల్మ్ ఛాంబర్‌లో మీటింగ్.. తీసుకున్న నిర్ణయాలేంటి.?
సినిమా ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్‌లో వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి అందులో తీసుకున్న నిర్ణయాలేంటి..? నిజంగానే థియేటర్స్ బంద్ కాబోతున్నాయా..?
Updated on: May 22, 2025 | 2:53 PM

చాలా రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య పర్సెంటేజ్ యుద్ధం నడుస్తూనే ఉంది. తమకు పర్సెంటేజ్ సిస్టమ్‌లో సినిమాలు విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు పట్టు పడుతుంటే.. అలా చేస్తే తమకు నష్టం వస్తుందంటున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన సంయుక్త రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ మీటింగ్‌కు దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.

అందులో సురేష్ బాబు, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ మీటింగ్‌లో తమ డిమాండ్స్ ఛాంబర్ ముందు పెట్టారు ఎగ్జిబిటర్లు. ప్రస్తుతం నడుస్తున్న అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపే పరిస్థితుల్లో తాము లేమని చెప్పేసారు థియేటర్ యాజమాన్యం. అలా చేస్తే నష్టాలు వస్తున్నాయంటున్నాయని.. థియేటర్స్ నడపలేని స్టేజీలోకి వెళ్లిపోయామని తమ కష్టాలు చెప్పుకున్నారు.

ఓ సినిమాకు 30 కోట్ల గ్రాస్ వస్తే.. ఎగ్జిబిటర్ షేర్‌లో తొలివారం 25 శాతం.. రెండో వారం 45 శాతం.. మూడో వారం 60 శాతం.. మిగిలిన వారాలు 70 శాతం డిమాండ్ చేస్తున్నారు. అలాగే రూ. 10 కోట్ల నుంచి 30 కోట్ల గ్రాసర్స్‌కు.. 1వ వారం 40 శాతం.. 2వ వారం 50 శాతం.. 3వ వారం 60 శాతం.. మిగిలిన వారాలు 70 శాతం డిమాండ్ చేస్తున్నారు. 10 కోట్ల లోపు గ్రాసర్స్‌కు 1వ వారం 50 శాతం.. 2వ వారం 60 శాతం.. మిగిలిన వారాలు 70 శాతం అడుగుతున్నారు.

గత పదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. దాదాపు 1400 థియేటర్లు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని థియేటర్లు మూత పడక తప్పదు.

అందుకే సినిమా నిర్మాతలు సహకరించి పర్సంటేజ్ విధానానికి అంగీకరించాలని కోరుతున్నారు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు. మరి దీనిపై మన టాలీవుడ్ నిర్మాతల రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.




